Site icon NTV Telugu

NIT-Calicut Professor: గాడ్సేని ప్రశంసించిన ఎన్ఐటీ ప్రొఫెసర్ డీన్‌గా నియామకం.. వివాదం..

Kerala

Kerala

NIT-Calicut Professor: మహాత్మా గాంధీపై నాథురామ్ గాడ్సే దాడిని ప్రశంసించిన ఎన్ఐటీ-కాలికట్ ప్రొఫెసర్‌కి పదోన్నతి లభించడం కేరళలో వివాదంగా మారింది. ఆమెకు ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ డీన్‌గా నియమితులయ్యారు. కాలికట్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) డైరెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులో, డాక్టర్ షైజా ఎ మార్చి 7 నుండి ప్లానింగ్ అండ్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ డీన్‌గా నియమితులైనట్లు పేర్కొంది.

Read Also: ICC ODI Rankings: ఐసీసీ ర్యాక్సింగ్‌లో టీమిండియా హవా.. టాప్-10లో నలుగురు మనళ్లే

రైట్ వింగ్ న్యాయవాది షేర్ చేసిన పోస్ట్‌కి ప్రతిస్పందనగా, గాడ్సేని షైజా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై కమ్యూనిస్ట్ విభాగాలు, విద్యార్థి సంఘాలు DYFI, SFIలతో పాటు యూత్ కాంగ్రెస్ వంటి సంస్థలు ఈమెపై ఫిర్యాదు చేశాయి. గత ఏడాది ఫిబ్రవరిలో షైజాను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆమె బెయిల్‌పై విడుదలయ్యారు.

మహాత్మా గాంధీని హత్య చేసి, గాడ్సే భారతదేశాన్ని కాపాడటంపై షైజా ప్రశంసించారని ఆరోపణలు ఉన్నాయి. డీన్‌గా షైజా నియామకాన్ని కొన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. సీపీఎం అనుబంధ విభాగాలు నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చాయి. డీన్‌గా షైజా రెండేళ్ల పాటు లేదా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఉంటుంది.

Exit mobile version