ప్రతి ఏడాది అత్యంత శక్తివంతమైన జాబితాలో చోటు దక్కించుకనే మహిళలు, ప్రముఖులు ఫోర్బ్స్ మ్యాగజైన్‌లో ఎక్కడం సర్వ సాధారణం. కానీ ఇందులో పేరు ఎక్కాలంటే ఎంతో శ్రమతో పాటు పేరు, ప్రతిష్టలు సంపాదించాలి. ప్రపపంచ వ్యాప్తంగా ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకునే వారి సంఖ్య చాలా తక్కువ. అంతలా వడబోసి మరీ వెతుకుతుంది ప్రముఖుల జాబితాను ఫోర్బ్స్ మ్యాగజైన్ . వారు చేస్తున్న సేవలు, ఉన్న స్థానం, ప్రస్తుతం తీసుకునే నిర్ణయాల ఆధారంగా పోర్బ్స్‌లో చోటు దక్కించుకోవడానికి అవకాశం ఉంటుంది.
అయితే తాజాగా భారత్ నుంచి వరల్డ్ ఫోర్బ్స్ అత్యంత 100 మంది శక్తివంతమైన మహిళల జాబితాలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ 37వ స్థానంలో ఉన్నారు. నైకా వ్యవస్థాపకురాలు ఫల్గుని నాయర్ 88వ ప్లేస్‌లో నిలిచారు. మొదటి స్థానంలో అమెరికా రచయిత్రి మెకంజీ స్కాట్ కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు 17 సార్లు జాబితాను ప్రకటించగా 15 సార్లు జర్మనీ మాజీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ టాప్ ప్లేస్‌లో నిలిచారు. ఈ సారి ఆమె స్థానాన్ని మెకంజీ భర్తీ చేశారు.
