Site icon NTV Telugu

NIRF Rankings 2022: తొలిస్థానంలో ఐఐటీ మద్రాస్.. హైదరాబాద్ యూనివర్సిటీది ఏ స్థానం.?

Iit Madras

Iit Madras

నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ ( ఎన్ఐఆర్ఎఫ్)ను విడుదల చేశారు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. అధికారిక వెబ్ సైట్ లో ర్యాకింగ్ సంబంధిత విషయాలను వెల్లడిాంచారు. మొత్తం 11 కేటగిరీల్లో ఎన్ఐఆర్ఎఫ్ ఇండియా ర్యాంకింగ్స్ ప్రకటించారు. విశ్వవిద్యాయాలం, నిర్వహణ, కళాశాల, ఫార్మసీ, మెడికల్, ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, లా, రిసెర్చ్, డెంటల్ కు సంబంధించిన విద్యాసంస్థలు ఉన్నాయి.

టీచింగ్, లర్నింగ్ అండ్ రిసోర్సెస్, రీసెర్చ్ అండ్ ప్రొఫెషనల్ ప్రాక్టీస్, గ్యాడ్యుయేషన్ అవుట్ కమ్, ఔట్ రీచ్, ఇన్‌క్లూసివిటీ, పర్సెప్షన్ ఇలా ఐదు అంశాల కింద విద్యాసంస్థలకు మార్కులు కేటాయించి ర్యాంకులు ఇస్తారు. ఓవరాల్ గా అన్ని విభాగాల్లో తీసుకుంటే ఐఐటీ – మద్రాస్ తొలిస్థానంలో నిలిచింది.

ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ 2022: ఇంజనీరింగ్ విభాగం ర్యాంకింగ్స్ వరసగా..

1)ఐఐటీ మద్రాస్, 2)  ఐఐటీ ఢిల్లీ, 3) ఐఐటీ బాంబే, 4) ఐఐటీ కాన్పూర్, 5) ఐఐటీ ఖరగ్ పూర్, 6) ఐఐటీ రూర్కీ, 7) ఐఐటీ గౌహతి,  8)  ఎన్ఐటీ తిరుచిరాపల్లి, 9) ఐఐటీ హైదరాబాద్ 10) ఎన్ఐటీ సూరత్కల్

ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ 2022: యూనివర్సిటీ ర్యాకింగ్స్

1)  ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ , బెంగళూర్, 2)  జవహర్ లాల్ యూనివర్సిటీ, ఢిల్లీ 3) జామియా మిల్లియా ఇస్లామియా, ఢిల్లీ,  4)జాదవ్ పూర్ యూనివర్సిటీ, కోల్ కతా, 5) అమృత విశ్వవిద్యా పీఠం, కోయంబత్తూర్, 6) బనారస్ హిందూ యూనివర్సిటీ,  వారణాసి, 7) మణిపాల్ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, మణిపాల్, 8) కలకత్తా యూనివర్సిటీ, కోల్ కతా, 9) వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వెల్లూర్, 10) యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, హైదరాబాద్

ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ 2022: ఓవరాల్ ర్యాంకింగ్స్

1) ఐఐటీ – మద్రాస్, 2) ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ , బెంగళూర్, 3) ఐఐటీ బాంబే, 4) ఐఐటీ ఢిల్లీ, 5) ఐఐటీ కాన్పూర్, 6) ఐఐటీ ఖరగ్ పూర్, 7) ఐఐటీ రూర్కీ, 8) ఐఐటీ గౌహతి, 9) ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(ఎయిమ్స్), ఢిల్లీ, 10) జే ఎన్ యూ, ఢిల్లీ

మేనేజ్మెంట్ విభాగంలో మొదటిస్థానంలో ఐఐఎం అహ్మదాబాద్, రెండోస్థానంలో ఐఐఎం బెంగళూరు, మూడోస్థానంలో ఐఐఎం కోల్‌కత్తా

ఫార్మసీ కేటగిరీలో మొదటిస్థానంలో జామియా – న్యూఢిల్లీ, రెండోస్థానంలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్, హైదరాబాద్, మూడోస్థానంలో పంజాబ్ యూనివర్సిటీ, చండీగఢ్

టాప్ 3 కాలేజీల కేటగిరీలో మొదటిస్థానంలో మిరిండా కాలేజి, న్యూఢిల్లీ, రెండో స్థానంలో హిందూ కాలేజి, న్యూఢిల్లీ, మూడోస్థానంలో ప్రెసిడెన్సీ కాలేజి, చెన్నై

ఆర్కిటెక్చర్ విభాగంలో మొదటిస్థానంలో ఐఐటీ రూర్కీ, రెండోస్థానంలో ఎన్ఐటీ కాలికట్, మూడోస్థానంలో ఐఐటీ, ఖరగ్‌పూర్

లా విభాగంలో మొదటిస్థానంలో నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా, బెంగళూరు, రెండోస్థానంలో నేషనల్ లా యూనివర్సిటీ న్యూఢిల్లీ, మూడోస్థానంలో సింబియాసిస్ లా స్కూల్, పూణే

మెడికల్ కేటగిరీలో మొదటిస్థానంలో ఎయిమ్స్, న్యూఢిల్లీ, రెండోస్థానంలో పీజీఐఎంఐ, చండీగఢ్, మూడోస్థానంలో క్రిస్టియన్ మెడికల్ కాలేజి, వేలూర్ (తమిళనాడు)

డెంటల్ కేటగిరీలో సవితా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ సైన్సెస్ – చెన్నై, రెండోస్థానంలో మణిపాల్ కాలేజి ఆఫ్ డెంటల్ సైన్సెస్ – మణిపాల్, మూడోస్థానంలో డా. డీవైపాటిల్ విద్యాపీఠ్, పూణే

రీసెర్చ్ కేటగిరీలో మొదటిస్థానంలో ఐఐఎస్సీ బెంగళూరు, రెండోస్థానంలో ఐఐటీ మద్రాస్, మూడోస్థానంలో ఐఐటీ ఢిల్లీ

Exit mobile version