Nashik Forced Conversion: బలవంతపు మతమార్పిడి, లైంగిక వేధింపుల ప్రధాన నిందితురాలు నిదా ఖాన్ అరెస్టు
- టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నాసిక్ యూనిట్‌లో మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులు, బలవంతపు మతమార్పిడి ప్రయత్నాలు
- ప్రధాన నిందితురాలు నిదా ఖాన్ అరెస్టు
- శుక్రవారం నాసిక్ కోర్టులో హాజరు పరచనున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నాసిక్ యూనిట్‌లో మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులు, బలవంతపు మతమార్పిడి ప్రయత్నాలు, మతపరమైన భావాలను దెబ్బతీయడం వంటి ఆరోపణలతో సంబంధిత కేసులో ప్రధాన నిందితురాలు నిదా ఖాన్ ను గురువారం (మే 7) ఛత్రపతి సంభాజీనగర్లో అరెస్టు చేశారు. నాసిక్ పోలీస్ కమిషనర్ సందీప్ కర్ణిక్, SIT బృందం సమాచారం మేరకు, ఛత్రపతి సంభాజీనగర్ పోలీసుల సహాయంతో జాయింట్ ఆపరేషన్‌లో నిదా ఖాన్‌ను అరెస్టు చేశారు. ఆమెను శుక్రవారం నాసిక్ కోర్టులో హాజరు పరచనున్నారు.
కేసు వివరాలు
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
నాసిక్ TCS యూనిట్‌లో 2022 జూలై నుంచి 2026 ఫిబ్రవరి మధ్య కాలంలో మహిళా ఉద్యోగులు (ప్రధానంగా షెడ్యూల్డ్ కులాలకు చెందినవారు) లైంగిక వేధింపులు, మానసిక వేధింపులు, బలవంతపు మతమార్పిడి ప్రయత్నాలకు గురైనట్లు ఫిర్యాదులు వచ్చాయి. నిందితులు వ్యవస్థీకృతంగా మహిళలపై ఒత్తిడి తెచ్చి ఇస్లామిక్ సంప్రదాయాల ప్రకారం దుస్తులు ధరించాలని, ప్రవర్తించాలని బలవంతపెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. హిందూ దేవతలపై అభ్యంతరకర వ్యాఖ్యలు, బుర్ఖా, రిలిజియస్ బుక్స్ ఇవ్వడం, మలేషియా పంపే ప్రయత్నాలు వంటి ఆరోపణలు ఉన్నాయి.
నాసిక్ పోలీసులు 9 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి, SIT ఏర్పాటు చేశారు. ఇప్పటికే 8 మందిని అరెస్టు చేశారు. నిదా ఖాన్ ఎఫ్‌ఐఆర్ నమోదు అయిన తర్వాత పరారీలో ఉండగా, దాదాపు 40 రోజుల తర్వాత అరెస్టు చేశారు. కాగా నిదా ఖాన్ తన రెండు నెలల గర్భాన్ని కారణంగా చూపి ముందస్తు బెయిల్ కోరింది. అయితే నాసిక్ కోర్టు ఆమెకు మధ్యంతర రక్షణ ఇవ్వడానికి నిరాకరించింది. ఆమెపై IPC సెక్షన్లతో పాటు షెడ్యూల్డ్ కులాలు & షెడ్యూల్డ్ తెగల (అత్యాచారాల నివారణ) చట్టం కింద కూడా సెక్షన్లు జోడించారు. TCS స్పందిస్తూ.. నిందితులను సస్పెండ్ చేసి, అంతర్గత విచారణ చేపట్టినట్లు తెలిపింది. హెరాస్‌మెంట్‌కు zero-tolerance పాలసీ ఉందని పేర్కొంది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!