NTV Telugu Site icon

NIA Raids: ముంబైలో సోదాలు… దావూద్ ఇబ్రహీంతో లింకులపై విచారణ

Dawood

Dawood

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో సంబంధాలు ఉండీ అనుచరులుగా చలామణీ అవుతున్న వ్యక్తుల ఇళ్లలో నేషనల్ ఇన్వేస్టిగేషన్ ఎజెన్సీ (ఎన్ఐఏ) సోదాలు నిర్వహిస్తోంది. నిన్న ముంబై వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. మొత్తంగా 29 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ముంబైలోని నాగ్ పాడ, గోరేగావ్, బోరివళి, శాంటాక్రూజ్, ముంబ్రాలోని పలువురు దావూద్ ఇబ్రహీం అనుచరుల ఇళ్లలో సోదాలు చేశారు. హవాలా ఆపరేటర్స్, రియల్ ఎస్టేట్, డ్రగ్ ట్రాఫికర్స్ నేరాలకు పాల్పడుతూ… దావూద్ ఇబ్రహీంతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణ ఉన్న వారి ఇళ్లపై ఎన్ఐఏ దాడులు నిర్వహించింది. తాజాగా ఆరోజు దావూద్ తో సంబంధం ఉందనే ఆరోపణలపై 15 మందిని ఎన్ఐఏ విచారణకు పిలిచింది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి అరెస్ట్ లు చేయలేదు.

మనీలాండరింగ్ కేసు, దావూద్ ఇబ్రహీంతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో గతంలో ఎన్సీపీ నేత, ప్రస్తుతం శివసేన సర్కార్ లో మంత్రిగా ఉన్న నవాబ్ మాలిక్ ను ఈడీ అరెస్ట్ చేసి జైలుకు తరలించింది. దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్ తో నవాబ్ మాలిక్ నగదు లావాదేవీలు జరిపినట్లు ఈడీ ఆరోపించింది. అయితే ఈ అరెస్ట్ రాజకీయంగా జరిగిందనే ఆరోపణలు చేశారు శివసేన, ఎన్సీపీ నేతలు. కావాలనే మహారాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ఈడీ, ఎన్సీబీ, ఎన్ఐఏ వంటి సెంట్రల్ ఏజెన్సీలను ఉపయోగిస్తోందని మహావికాస్ అఘాడీ ప్రభుత్వంలో ఉన్న పార్టీలు ఆరోపిస్తున్నాయి. నవాబ్ మాలిక్ అరెస్ట్ పై అధికార శివసే, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలకు, బీజేపీ పార్టీలకు మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు చోటు చేసుకున్నాయి.

ప్రస్తుతం పాకిస్తాన్ కరాచీలో ఉన్న దావూద్ ఇబ్రహీం తన అనుచరులతో ఇండియాలో మనీలాండరింగ్, ఉగ్రవాద నేరాలకు పాల్పడుతున్నాడు. కరాచీ నుంచే తన నెట్ వర్క్ ను ఆపరేట్ చేస్తున్నాడు. 1993 ముంబై బ్లాస్ట్ లతో దావూద్ ఇబ్రహీంకు సంబంధాలు  ఉన్నాయి. ఈ పేలుళ్లలో ప్రధాన సూత్రధారుడిగా దావూద్ ఇబ్రహీం, డీ కంపెనీ ఉంది. అయితే అప్పటి నుంచి దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్ లో రాజభోగాలు అనుభవిస్తున్నాడు. ఏకంగా పాక్ ఆర్మీనే దావూద్ ఇబ్రహీంకు రక్షణ కల్పిస్తుంది.