Site icon NTV Telugu

Pahalgam Terror attack: కొనసాగుతున్న ఎన్ఐఏ దర్యాప్తు .. పాత ఉగ్రవాదులు విచారణ

Nia

Nia

పహల్గామ్ ఉగ్రదాడి కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ దర్యాప్తు కొనసాగిస్తోంది. విచారణలో భాగంగా పాత ఉగ్రవాదులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 2023లో రాజౌరీలో దాడికి పాల్పడ్డ ఇద్దరు ఉగ్రవాదులను జమ్మూ జైల్లో అధికారులు ప్రశ్నించారు. పహల్గామ్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉంటాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Janu : సూసైడ్ చేసుకుంటానంటూ డాన్సర్ జాను సెల్ఫీ వీడియో.. అసలు విషయం ఇదే..!

2023, జనవరిలో రాజౌరీలోని ధోంగ్రీ గ్రామంపై ఇద్దరు ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో ఐదుగురు చనిపోయారు. దాడి సమయంలో ఓ ఇంటిలో ఐఈడీని దుండగులు అమర్చారు. మర్నాడు అది పేలి మరో ఇద్దరు చనిపోయారు. దీంతో ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన నిస్సార్‌ అహ్మద్‌, ముస్తాక్‌ హుస్సేన్‌ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు.

ఇది కూడా చదవండి: Crime: వివాహిత హత్య కేసులో కీలక పురోగతి.. వెలుగులోకి సంచలన విషయాలు

ఇక పహల్గామ్ ఉగ్ర దాడి సమయంలో పలువురి మొబైల్‌లో టెర్రరిస్టుల కదలికలు కనిపించాయి. వాటి ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఉగ్రవాదులకు దాదాపు 20 మంది సహకరించినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ గుర్తించింది. వీరిలో చాలా మందిని ఇప్పటికే అరెస్టు చేశారు. విచారణలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 2,500 మందిని ప్రశ్నించినట్లు తెలిపింది. ఇక పహల్గామ్ ఉగ్ర దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు.

Exit mobile version