Next 48 Hours Critical For Army Dog: అనంత్‌నాగ్‌లో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో గాయపడిన ఆర్మీ డాగ్ ‘జూమ్’ పరిస్థితి విషమంగానే ఉందని.. మరో 24-48 గంటలు గడిస్తే కానీ పరిస్థితిని చెప్పలేమని.. వైద్య బృందం చికిత్స అందిస్తోందని భారత ఆర్మీ అధికారులు బుధవారం వెల్లడించారు. ఆర్మీ డాగ్ జూమ్ కు శస్త్రచికిత్స చేశారు వైద్యులు. ప్రస్తుతం ఆర్మీ డాగ్ పరిస్థితి నిలకడగా ఉంది. వెనకాలు విరగడంతో పాటు ముఖంపై గాయాలకు చికిత్స చేశారు డాక్టర్లు. తదుపరి 24-48 గంటలు క్లిష్టమైనవని.. భారత ఆర్మీ అధికారులు తెలిపారు.
Read Also: Supreme Court: ప్రార్థనా స్థలాల చట్టంపై కేంద్రానికి మరో రెండు వారాల గడువు..
అనంత్ నాగ్ లోని కోకెర్ నాగ్ లో మంగళవారం ఉగ్రవాదులు భద్రతా బలగాలకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఎదురుకాల్పుల్లో ఆర్మీ డాగ్ జూమ్ కీలకంగా వ్యవహరించింది. ఇద్దరు ఉగ్రవాదులను చంపడంలో సహాయపడింది. అయితే ఈ సమయంలో జూమ్ తీవ్రంగా గాయపడింది. ఆపరేషన్ టాంగ్ పావాస్ పోరాట బృందంలో భాగంగా ఉంది. గాయపడినప్పటికీ.. జూమ్ ఎక్కడా తగ్గకుండా తన పనిని కానిచ్చింది. దీని ఫలితంగానే ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా సిబ్బంది హతమార్చారు. ప్రస్తుతం జూమ్ కు శ్రీనగర్ లో చికిత్స అందిస్తున్నారు.
జూమ్ త్వరగా కోలుకోవాలని కోరుతూ ఇండియన్ ఆర్మీ చినార్ కార్ప్స్ ట్వీట్ చేసింది. ఆర్మీ డాగ్ ‘జూమ్’ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామని..ఉగ్రవాదులతో తలపడుతుండగా.. ఆపరేషన్ సమయంలో ఆర్మీ డాగ్ జూమ్ తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం శ్రీనగర్ లో చికిత్స పొందుతోందని.. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామని ట్వీట్ చేశారు.
