NTV Telugu Site icon

NewsClick: చైనాతో న్యూస్‌క్లిక్ న్యూస్ పోర్టల్‌కి సంబంధం.. అమెరికా కీలక వ్యాఖ్యలు..

Newsclick

Newsclick

NewsClick: చైనా అనుకూల ప్రచారం చేస్తూ, చైనా నుంచి డబ్బులు తీసుకున్న ఆరోపణల నేపథ్యంలో న్యూస్‌క్లిక్ మీడియా పోర్టల్ ఎడిటర్ ఇన్ ఛీఫ్ ప్రబీర్ పురకాయస్థను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన తోపాటు ఈ సంస్థ హెచ్ఆర్ హెడ్ అమిత్ చక్రవర్తిని అరెస్ట్ చేశారు. మంగళవారం అర్దరాత్రి అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా.. కోర్టు వీరికి ఏడు రోజుల పోలీస్ కస్టడీ విధించింది. మంగళవారం ఢిల్లీ పోలీసులు ఒకే సమయంలో న్యూస్‌క్లిక్ ఆఫీస్, ఆ సంస్థలో పనిచేస్తున్న జర్నలిస్టుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. 46 మందిని విచారించగా ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్‌లు సహా డిజిటల్ పరికరాలను, డాక్యుమెంట్లను పరీక్షల నిమిత్తం తీసుకెళ్లారు.

Read Also: World Cup 2023: ఖలిస్తానీల బరితెగింపు.. ప్రపంచకప్ ముందు ‘ఖలిస్తాన్ జిందాబాద్’ అంటూ స్లోగన్స్..

ఇదిలా ఉంటే ఈ వ్యవహారంపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. న్యూస్‌క్లిక్ మీడియాకు చైనాతో సంబంధాలున్నాయనే వార్తల్ని చూభామని అమెరికా సీనియర్ అధికారి తెలిపారు. అయితే ఈ వార్తల్లో నిజానిజాలపై ఇప్పుడేం స్పందించలేమని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ మీడియా సమావేశంలో వెల్లడించారు. అయితే శక్తివంతమైన, స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యంలో మీడియా చేపడుతున్న బలమైన పాత్రకు తాము మద్దతిస్తున్నట్లు వెల్లడించారు. భారత్ తో పాటు పలు దేశాల వద్ద ఇలాంటి అంశాలను అమెరికా ప్రస్తావించిందని, ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛతో పాటు జర్నలిస్టుల హక్కులను గౌరవించుకోవడం ఎంత అవసరమో గుర్తుంచుకోవాలని కోరినట్లు ఆయన వెల్లడించారు.

న్యూస్‌క్లిక్‌కి చైనా నుంచి వేల కోట్లు అందుతున్నాయంటూ.. ఈ ఏడాది ఆగస్టులో న్యూయార్క్ టైమ్స్ తో సమా అమెరికా పత్రికల్లో కథనాలు వచ్చాయి. అమెరికన్ సిటిజన్, కోటీశ్వరడైన నెవెల్లే రాయ్ సింగం, ఆయనకు చెందిన న్యూస్ క్లిక్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాకు చెందిన ప్రమాదకర సాధనాలని పేర్కొంది. ఈ ఆరోపణలపై గతంలో ఈడీ సోదాలు నిర్వహించి పలు ఆస్తుల్ని జప్తు చేసింది. ఈడీ సమాచారంతో ఉపా చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.