NTV Telugu Site icon

Bride Kidnap: పెళ్లిలో షాకింగ్ ఘటన.. వధువు మెడపై కత్తిపెట్టి కిడ్నాప్

Newly Wed Bride Kidnap

Newly Wed Bride Kidnap

Newly Wedded Bride Kidnapped By Ex-Lover In Rajasthan: అది ఒక పెళ్లి వేడుక. పెళ్లి తంతు మొత్తం ముగిసింది. తాళి కట్టడం, ఏడు అడుగులు నడవడం మొత్తం ముగిసింది. అప్పగింతలు కూడా అయిపోయాయి. అత్తారింటికి వెళ్లే ముందు నూతన వధూవరులు దేవుని దర్శనం కోసం వెళ్లారు. అక్కడే ఓ ఊహంచని పరిణామం చోటు చేసుకుంది. ఎక్కడి నుంచి వచ్చాడో తెలీదు కానీ, ఓ యువకుడు సడెన్‌గా ఊడిపడ్డాడు. అందరి సమక్షంలోనే అతడు వధువు మెడపై కత్తిపెట్టి, ఆమెని అక్కడి నుంచి తీసుకెళ్లిపోయాడు. ఈ ఘటన రాజస్థాన్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..

Ishant Sharma: ధోనీ అస్సలు ‘కూల్’ కాదు, అందరినీ తిట్టాడు.. ఇషాంత్ షాకింగ్ కామెంట్స్

రాజస్థాన్‌లోని భీల్వాడా పరిధిలో బిజోలియాకు చెందిన రవి నాయక్‌కు లాఛుడాకు చెందిన ఓ యువతితో వివాహం నిశ్చయించారు. వీరి పెళ్లిని ఘనంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో, వారి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. అప్పగింతలు అయిపోయాక.. వధూవరులు తమ బంధువులతో కలిసి ఒక ఆలయానికి దేవుని దర్శనం కోసం వెళ్లారు. ఇంతలో ముగ్గురు యువకులు ఒక స్కూటర్‌ సడెన్ ఎంట్రీ ఇచ్చారు. కత్తులు చూపించి, పెళ్లివారిని బెదిరించారు. అంతేకాదు.. వధువు మెడపై కత్తి పెట్టి, ఆమెని అక్కడి నుంచి తీసుకుని వెళ్లారు. ఆ ముగ్గురిని పట్టుకునేందుకు బంధువులు కొంత దూరం వెంబడించారు కానీ, వారిని పట్టుకోలేకపోయారు. దీంతో చేసేదేమీ లేక, ఈ ఘటనపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Uttar Pradesh Crime: 10 రోజులు మనవడి శవంతో గడిపిన అమ్మమ్మ.. అలా బయటపడ్డ రహస్యం

ఈ సందర్భంగా వరుడు రవి నాయక్ మాట్లాడుతూ.. అప్పగింతల కార్యక్రమం పూర్తయ్యాక తాము భగవంతుని ఆశీర్వాదం కోసం ఆలయానికి వెళ్లామని తెలిపాడు. సరిగ్గా అదే సమయంలో.. ముగ్గురు యువకులు వచ్చి, కత్తులతో బెదిరించి, తన భార్యని కిడ్నాప్ చేశారని చెప్పాడు. ఈ క్రమంలో తన భార్య చేతికి గాయం కూడా అయ్యిందన్నాడు. ఇది తప్పకుండా తన భార్యని ప్రేమించిన యువకుడి పనే అయ్యుంటుందని అతడు వాపోయాడు. మరోవైపు.. పోలీసులు ఈ కేసుని సీరియస్‌గా తీసుకొని, అమ్మాయిని కిడ్నాప్ చేసిన ముగ్గురు యువకుల కోసం గాలిస్తున్నారు.