Newly Wed Man Runs Away From Wife When Car Caught In Bengaluru Traffic: ఎవరైనా పెళ్లి అయ్యాక ‘హనీమూన్’ ప్లాన్ వేసుకుంటారు. భార్యతో కలిసి మధురమైన క్షణాలను గడపాలని కోరుకుంటారు. కానీ.. ఓ భర్త మాత్రం అందుకు భిన్నంగా భార్యను వదిలి పారిపోయాడు. ట్రాఫిక్ జామ్‌లో కారు చిక్కుకున్నప్పుడు.. వెంటనే కారు దిగి, అదేదో ఒలంపిక్స్‌లో మెడల్ సాధించే రేంజ్‌లో పరుగు లంకించాడు. భార్య వెంబడించినా ప్రయోజనం లేకుండా పోయింది. అతడు కంటికి కనిపించకుండా పారిపోయాడు. దీంతో.. ఆ అతని భార్య పోలీసుల్ని ఆశ్రయించింది. తన మాజీ లవర్ బెదిరింపుల కారణంగానే.. భర్త ఈ పనికి పాల్పడ్డాడని అతని భార్య తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది.
Xi Jinping: ముచ్చటగా మూడోసారి.. చైనా అధ్యక్షుడిగా జిన్‌పింగ్ ప్రమాణస్వీకారం
భార్య చెప్పిన వివరాల ప్రకారం.. ‘‘ఫిబ్రవరి 15వ తేదీన మా పెళ్లి జరిగింది. అయితే.. ఆ తర్వాతి రోజు నుంచే భర్త డిప్రెషన్‌లో ఉండటాన్ని నేను గమనించాను. ఏమైందని ప్రశ్నిస్తే.. గోవాలో ఉంటున్న తన మాజీ ప్రియురాలు తనని బ్లాక్‌మెయిల్ చేస్తోందని చెప్పాడు. నేను అతనికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశాను. మా కుటుంబ సభ్యులు కూడా అతనికి అండగా ఉంటామని చెప్పారు. బీబీఏ గ్రాడ్యుయేట్ అయిన నా భర్త.. గోవా, కర్ణాటకలో ఉన్న తన తండ్రి బిజినెస్ చూసుకుంటున్నాడు. ఆయన మాజీ లవర్ గోవాలోని కంపెనీలో ఒక ఎంప్లాయి. మార్చి 5వ తేదీన మేమిద్దరం చర్చికి వెళ్లి, ఇంటికి తిరిగొస్తున్నాం. అప్పుడు ఒక చోట భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కారులో ముందు సీటులో కూర్చున్న నా భర్త, ఒక్కసారిగా డోర్ ఓపెన్ చేసి పారిపోయాడు. నేను వెంబడించాను కానీ, అతడ్ని పట్టుకోలేకపోయాను. నేను ధైర్యం ఇచ్చినప్పటికీ, అతడు ఎందుకు పారిపోయాడు తెలీదు. తన మొబైల్ ఫోన్‌ని కారులోనే వదిలేసి వెళ్లిపోయాడు’’ అని తెలిపింది.
Dry Cough: పొడి దగ్గుతో నిద్ర పట్టట్లేదా.. పడుకునే ముందు ఇవి తీసుకోండి
తన భర్త లవ్ స్టోరీ గురించి తమకు తెలియదని.. మూడు నెలల క్రితమే పెళ్లి నిశ్చయించడం, ఫిబ్రవరిలో పెళ్లి జరగడం.. చకచకా జరిగిపోయాయని భార్య తెలిపింది. సోషల్ మీడియాలో ఎవరో మాజీ ప్రియురాలితో తన భర్త కలిసి ఉన్న ఫోటోని షేర్ చేసి సర్క్యులేట్ చేశారని, అది తెలిసినప్పటి నుంచి ఆయన డిప్రెషన్‌లో ఉన్నాడని, చాలా వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టాడని పేర్కొంది. అది చూసి.. ఆయన ఏమైనా చేసుకుంటాడేమోనని తాము భయపడ్డామని చెప్పింది. మాజీ ప్రియురాలి వద్దకు వెళ్లాడేమోనన్న అనుమానంతో ఆరా తీస్తే.. ఆమెతో కాంటాక్ట్ అవ్వలేదని తమకు తెలిసిందని వెల్లడించింది. స్నేహితులు, సన్నిహితుల్ని కూడా సంప్రదించామని.. కానీ ఆయన ఎక్కడికి వెళ్లాడో ఎవ్వరికీ తెలియదని చెప్పింది. ఈ నేపథ్యంలోనే తాము పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు భార్య వివరించింది.