Site icon NTV Telugu

New Parliament pics: కొత్త పార్లమెంట్ ప్రతీ భారతీయుడు గర్వించేలా ఉంటుందన్న ప్రధాని….

Lok Sabha

Lok Sabha

PM Modi: కొత్త పార్లమెంట్ భవనాన్ని ఈ నెల 28న ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించబోతున్నారు. ఈ భవనం ప్రారంభోత్సవం గురించి ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేస్తున్న పెద్దగా పట్టించుకోవడం లేదు కేంద్ర ప్రభుత్వం. ఇదిలా ఉంటే ఈ భవనానికి సంబంధించిన వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు ప్రధాని మోడీ.

కొత్త పార్లమెంట్ భవనం ప్రతీ భారతీయుడు గర్వించేలా ఉంటుందని ప్రధాని వ్యాఖ్యానించారు. ఈ వీడియోని మీ సొంత వాయిస్ ఓవర్ తో షేర్ చేయండి, ఇది మీ ఆలోచనల్ని తెలియజేస్తుంది, వాటిలో కొన్నింటిని మళ్లీ ట్వీట్ చేస్తాను అంటూ నెటిజన్లను కోరారు. ‘‘మై పార్లమెంట్ మై ప్రైడ్’’ హ్యాష్ ట్యాగ్ ఉపయోగించడం మరిచిపోవద్దు అంటూ ట్వీట్ చేశారు.

త్రిభుజాకారంలో నాలుగు అంతస్తుల పార్లమెంటు భవనం 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది.ఈ భవనంలో మూడు ప్రధాన ద్వారాలు ఉన్నాయి – జ్ఞాన్ ద్వార్, శక్తి ద్వార్ మరియు కర్మ ద్వార్ ఉన్నాయి.

కొత్త పార్లమెంట్ భవనం లోక్ సభలో 888 మంది, రాజ్యసభలో 300 మంది వరకు సౌకర్యవంతంగా కూర్చునేలా నిర్మించారు. ఉభయసభల్లో మొత్తంగా 1280 మంది సభ్యులు కూర్చునేందుకు అనువుగా భవనాన్ని నిర్మించారు.

Exit mobile version