Site icon NTV Telugu

Woman’s lemon crushing ritual car accident : అరే.. నిమ్మకాయలు తొక్కించబోతే…ఏంత పనైపోయింది..

Sam (6)

Sam (6)

కొత్త కారు కొన్నామనే ఆనందంలో నిమ్మకాయల్ని తొక్కించబోతే.. అదికాస్తా ఫస్ట్‌ ఫ్లోర్‌ నుంచి కిందపడి ధ్వంసమైన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎవరికి ఏమి జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడయాలో వైరల్ అవుతున్నాయి.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఘజియాబాద్‌కు చెందిన మాని పవార్‌ అనే మహిళ 27 లక్షల థార్ ఎస్ యూవీ కార్ ని కొనుగోలు చేసింది. కారుని తీసుకోవడానికి నిర్మాణ్ విహార్‌లోని మహీంద్రా షోరూమ్‌కు వెళ్లారు. అక్కడ కారు కొన్నామనే సంతోషంలో దానిని బయటకు తీసుకెళ్లే ముందు పూజ చేయాలని అనుకున్నారు. దీంతో మాని పవార్‌ షోరూమ్‌ ఫస్ట్‌ ఫ్లోర్‌లో ఉన్న కారు చక్రాల కింద నిమ్మకాయలు పెట్టి తొక్కించారు. వెంటనే బ్రేక్ పై కాలు వేయకుండా ఆమె ఎక్సలేటర్ పై కాలు వేసింది. దీంతో వాహనం మొదటి అంతస్తు నుంచి ఎగిరి కింద ఉన్న పేవ్ మెంట్ పైకి దూసుకెళ్లింది.

ఈ ఘటన జరిగినపుడు కారులో మాని, ఆమె భర్త ప్రదీప్ నిర్మన్, షోరూమ్ సిబ్బంది ఉన్నారు. వెంటనే ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో పెద్దగా ప్రమాదం జరగలేదని.. స్వల్పంగా గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. దీనిపై ఇంకా పూర్తి స్థాయి సమాచారం తెలియాల్సి ఉంది.

Exit mobile version