మరింత సులువుగా డ్రైవింగ్ లైసెన్స్.. కొత్త రూల్స్ ఇవే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇక, డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.. కేంద్రం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది.. వీటితో మరింత సులువుగా డ్రైవింగ్ లైసెన్స్ పొందేవీలుంది.. ఎందుకంటే.. డ్రైవింగ్ లైసెన్సుల జారీ ప్రక్రియలో పలు మార్పులు చేసింది కేంద్రం.. ఈ కొత్త నిబంధనలు జులై 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని కేంద్ర రహదారుల మంత్రిత్వ శాఖ పేర్కొంది.. ఇవాళ విడుదల చేసిన కొత్త రూల్స్ ప్రకారం.. దేశ వ్యాప్తంగా ఉన్న గుర్తింపు పొందిన డ్రైవర్ శిక్షణా కేంద్రాల నుంచి డ్రైవింగ్ లైసెన్సులు పొందే వీలుంటుంది.
కాగా, ప్రస్తుతం ప్రభుత్వ ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయంలో మొదట కంప్యూటర్ టెస్ట్.. ఆ తర్వాత అధికారుల ఎదుట డ్రైవింగ్ ట్రయల్ రన్ నిర్వహిస్తే.. మొదట లెర్నింగ్, ఆ తర్వాత పర్మినెంట్ డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేస్తున్నారు.. అయితే, ఈ ప్రక్రియలో డ్రైవర్ల డ్రైవింగ్ నైపుణ్యతలు తేల్చడం కాస్తా ఇబ్బందికరంగా ఉందని నిర్ధారణకు వచ్చిన కేంద్రం.. కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. గుర్తింపు పొందిన డ్రైవింగ్ స్కూళ్లలో ఉత్తీర్ణత సాధించిన వ్యక్తులకు వారు డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసే సమయంలో డ్రైవింగ్ పరీక్ష నుంచి మినహాయింపు ఇవ్వనున్నారు. అయితే, డ్రైవింగ్ శిక్షణా కేంద్రాలలో సిమ్యులేటర్లతో పాటు ప్రత్యేక డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ ఉండాల్సిందే.. మోటారు వాహనాల చట్టం, 1988 ప్రకారం అవసరాలకు అనుగుణంగా ఇటువంటి కేంద్రాలు రిమైడల్, రిఫ్రెషర్ కోర్సులను పొందే అవకాశాన్ని కూడా ఇవ్వాల్సి ఉంటుంది.. ఈ కేంద్రాలు ఇప్పుడు పరిశ్రమ-నిర్దిష్ట ప్రత్యేక శిక్షణను ఇవ్వడానికి కూడా అనుమతిస్తారని నోటిఫికేషన్‌లో పేర్కొంది ప్రభుత్వం.
Also Read
- Meta: ఆల్గోరిథం మార్చాల్సిందే.. మెటాకు నట్లు బిగిస్తున్న భారత్..
- Sheikh Hasina: షేక్ హసీనా వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు.. బంగ్లాదేశ్‌కు స్పష్టం చేసిన భారత్..
- Modi-Shinde: ప్రధాని మోడీతో ఏక్నాథ్ షిండే భేటీ.. సరికొత్త ఊహాగానాలు
- Kochi Flight: గాల్లో ఉండగా ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు యత్నం.. హడలెత్తిపోయిన ప్రయాణికులు
తాజావార్తలు
-
Meta: ఆల్గోరిథం మార్చాల్సిందే.. మెటాకు నట్లు బిగిస్తున్న భారత్..
-
Cricket Player: బోర్డును బురిడీ కొట్టించాలనుకున్నాడు.. చివరికి కెరీర్ క్లోజ్..
-
Ind Vs SL: ఊహించని రీతిలో రెచ్చిపోయిన శ్రీలంక బ్యాటర్స్.. చేతులెత్తేసిన టీమిండియా ఆటగాళ్లు..
-
Jupally Krishna Rao: ‘రాష్ట్రంలో నీటి కటకట ఉంది.. అంతటా ఎల్‌నినో ప్రభావం’..
-
Sheikh Hasina: షేక్ హసీనా వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు.. బంగ్లాదేశ్‌కు స్పష్టం చేసిన భారత్..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్‌ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!