ఆధార్ కార్డుల జారీ విషయంలో అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోకి అక్రమ వలసలను అరికట్టేందుకు ఆధార్ కార్డుల జారీ విషయంలో ఇకపై కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆధార్ కార్డు కావాలంటే జాతీయ పౌర నమోదు దరఖాస్తు నంబర్‌ను సమర్పించాల్సి ఉంటుంది. అక్టోబర్ 1 నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి రానుందని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వెల్లడించారు. త్వరలోనే మార్గదర్శకాలను విడుదల చేస్తామని వెల్లడించారు. రాష్ట్ర జనాభా కంటే ఆధార్ కార్డు దరఖాస్తుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని హిమంత శర్మ తెలిపారు. అస్సాంలో ఆధార్ కార్డుల జారీ ఇక ఎంతమాత్రం సులభం కాదని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Andhra Pradesh: వరద నష్టంపై ప్రాథమిక అంచనా.. కేంద్రానికి నివేదిక పంపిన ఏపీ సర్కార్
పొరుగు దేశం బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలు పెరుగుతున్నాయని, వారిని గుర్తించే ప్రక్రియను తాము వేగవంతం చేసినట్లు హిమంత శర్మ చెప్పారు. రెండు నెలల్లో పలువురిని ఆ దేశ అధికారులకు అప్పగించినట్లు తెలిపారు. దీంతో సరిహద్దు దగ్గర నిఘాను కట్టుదిట్టం చేసినట్లు పేర్కొన్నారు. సరిహద్దు భద్రత కోసం బీఎస్‌ఎఫ్, ఇతర ప్రభుత్వరంగ సంస్థలతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళతామని తెలిపారు.
ఇది కూడా చదవండి: Sunita kejriwal: హర్యానాలో సునీతా ఎన్నికల ప్రచారం.. మోడీకి కేజ్రీవాల్ తలవంచరని వ్యాఖ్య
ఇటీవల జరిగిన అల్లర్లతో బంగ్లాదేశ్ అట్టుడుకుంది. షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత.. హిందూవులపై దాడులు పెరిగిపోయాయి. దీంతో అనేక మంది భారత్‌లోకి వచ్చేశారు. సరిహద్దు రాష్ట్రాల్లోకి ప్రవేశించారు. బంగ్లాదేశ్ నుంచి అస్సాంలోకి ప్రవేశించడంతో ఆధార్ కార్డుల జారీ విషయంలో ప్రభుత్వం రూల్స్ మార్చేసింది.
ఇది కూడా చదవండి: Kolkata Doctor Murder Case: కోల్‌కతా అత్యాచార హత్య కేసులో ఓ జూనియర్ డాక్టర్ పాత్ర!.. ఎవరతను?