NTV Telugu Site icon

Himachal Pradesh: పర్యాటకులతో మనాలిలో భారీ ట్రాఫిక్.. నెటిజన్ల ఫన్నీ రియాక్షన్

Manali Traffic Jam

Manali Traffic Jam

ప్రస్తుతం హిమల్‌చల్ ప్రదేశ్ పర్యాటకులతో కిటకిటలాడుతోంది. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో దేశ నలుమూలల నుంచి పర్యాటకులు పోటేత్తున్నారు. భారీ సంఖ్యలు పర్యాటకులు రావడంతో మనాలి, అటల్‌ టన్నెల్‌ వద్ద ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. కిలోమీటర్ల మేర వాహనాలు వరుస కట్టిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పొగమంచు, వేల సంఖ్యలో పర్యాటకుల రాకతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో అక్కడ సుమారుగా 5 గంటల పాటు వాహనదారులు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

కొందరు అసహనం వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు సరదాగా స్పందిస్తున్నారు. అంతేకాదు ఆ సమయంలో ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన వారు కూడా స్వయంగా తమ అనుభవాన్ని కామెంట్స్ రూపంలో తెలిపారు. ఓ వ్యక్తి ‘అటల్‌ టన్నెల్‌ వద్ద ఐదు గంటల నుంచి చిక్కుకుపోయి ఉన్నాను’ మరికొందరు ఈ జామ్‌ క్లియర్‌ అయ్యేలోగా.. హాలిడే అయిపోతుందేమో..! అంటూ ఫన్నీగా స్పందిస్తున్నారు. మరో యూజర్ ‘క్రిస్మస్ కంటే ముందు వచ్చాం కాబట్టి మాకు ఇంత ట్రాఫిక్‌ జామ్‌ ఎదురుకాలేదు.. ఇప్పుడు వచ్చే ప్లాన్‌ చేసుకోని రావాలి అని సూచిస్తున్నారు. ఇలా ట్రాఫిక్‌తో ప్రజలు ఇబ్బంది పడుతున్న తరుణంలో కొందరు ఆకతాయిల చర్యలు నెటిజన్లను ఆగ్రహానికి గురిచేశాయి. రోడ్డుపై డోర్లు తెరిచి ఓ వ్యక్తి కారు నడుపుతుండగా.. మరికొందరు ఆ డోర్లకు వేలాడిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.

ఇలాంటి చర్యలతో కారు అదుపు తప్పే ప్రమాదం ఉందని, రోడ్లపై ఇలాంటి స్టంట్లు చేయొద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఈ ట్రాఫిక్ వీడియో ఏకంగా ముఖ్యమంత్రి సుఖ్‌విందర్ సింగ్‌ స్పందిస్తూ టూరిస్ట్‌లను స్వాగతించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. మొన్నటి వరకు వరదలతో అల్లాడిన హిమాచల్ ప్రదేశ్ పర్యాటకులతో కళకళలాడుతోందంటూ ఆనందం వ్యక్తం చేశారు. 10 వేల అడుగుల ఎత్తులో ఉన్న ప్రపంచంలోనే అత్యంత పొడవైన అటల్ టన్నెల్‌ నుంచి డిసెంబర్ 24న 12 వేల వాహనాల్లో 65వేల మంది ప్రయాణించారు. ప్రకృతి విపత్తు నుంచి కోలుకున్న హిమాచల్‌ ప్రదేశ్‌.. ఈ పండగ సీజన్‌లో పర్యాటకులను ఆహ్వానిస్తోంది’ అంటూ ఆయన రాసుకొచ్చారు.