NTV Telugu Site icon

Nepal: భారత వ్యాపారవేత్తపై ప్రధాని పుష్పకమల్ దహల్ కామెంట్స్.. రాజీనామా చేయాలని డిమాండ్స్..

Nepal

Nepal

Nepal: నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్(ప్రచండ) చిక్కుల్లో పడ్డారు. ఇప్పటికే నేపాల్ రాజకీయాలు అస్థిరంగా ఉన్నాయి. తాజాగా పీఎం దహల్ చేసిన వ్యాఖ్యలు అక్కడ అగ్గిని రాజేశాయి. నేపాల్ లో స్థిరపడిన ఓ భారతీయ వ్యాపారవేత్తను ఉద్దేశించి.. గతంలో ఆయన తనను ప్రధాని చేయడానికి కృషి చేశాడని ప్రధాని వ్యాఖ్యానించడం వివాదాన్ని రేకెత్తించింది. దీంతో ఆయన రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

నేపాల్‌లోని అగ్రగామి ట్రక్కింగ్ వ్యవస్థాపకుడు సర్దార్ ప్రీతమ్ సింగ్ నేపాల్-భారత్ సంబంధాలను మెరుగుపరచడంలో ప్రత్యేక మరియు చారిత్రాత్మక పాత్ర పోషించారని ప్రచండ అన్నారు. ‘రోడ్స్‌ టు ది వ్యాలీ: ది లెగసీ ఆఫ్‌ సర్దార్‌ ప్రీతమ్‌ సింగ్‌ ఇన్‌ నేపాల్‌’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా సోమవారంనాడు ప్రచండ ఈ వ్యాఖ్యలు చేశారు. నన్ను ప్రధాని చేయడానికి అయన అనేకసార్లు ఢిల్లీకి వెళ్లి.. ఖాట్మాండులోని రాజకీయ నేతలతో పలు దఫాలుగా చర్చలు జరిపారని అన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

Read Also: Inaya sultana : జారిపోతున్న డ్రెస్ లో బరువైన అందాలతో హాట్ షో చేస్తున్న ఇనయా..

ప్రధాన ప్రతిపక్ష పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్-(యూనిఫైడ్ మార్క్సిస్ట్-లెనినిస్ట్) (CPN-UML) బుధవారం జరిగిన జాతీయ అసెంబ్లీ సమావేశానికి అంతీరాయం కలిగించి, ప్రధాని రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. దీంతో గురువారం సభ మధ్యాహ్నాం 1 గంటలకు వాయిదా పడింది. కమ్యూనిస్ట్ పార్టీ చైర్మన్, మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ మాట్లాడుతూ.. ఆయన వ్యాఖ్యలు దేశ స్వాతంత్య్ర, గౌరవం, రాజ్యాంగం, పార్లమెంట్ కు దెబ్బ అని అన్నారు. న్యూఢిల్లీ నియమించిన ప్రధాని పదవిలో కొనసాగే హక్కు లేదని ప్రధాన ప్రతిపక్షాలు నినాదాలు చేశాయి.

ప్రచండ వ్యాఖ్యలపై విపక్షాలే కాకుండా అధికార పక్ష నేతలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని పీఎం ప్రచండ అన్నారు. నా అభిప్రాయం నేపాల్ అంతర్గత విషయాల్లో భారత్ జోక్యం చేసుకుందని చెప్పడం కాదని.. సర్దార్ ప్రతీమ్ సింగ్ కు రాజకీయాల్లో ఆసక్తి ఉందని చెప్పడమే అని అన్నారు.