Nepal Floods: వరదలకు మీరే కారణం.. భారత్, చైనా, అమెరికాలను టార్గెట్ చేస్తున్న నేపాల్..
- వరదలకు భారత్, చైనా, అమెరికాలను నిందిస్తున్న నేపాల్..
- కర్భన ఉద్గారాలు విడుదల వల్లే వరదలని వాదన..
- పరిహారం చెల్లించాలని అంతర్జాతీయంగా కోరుతున్న నేపాల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nepal Floods: నేపాల్ వరదలతో అతలాకుతలమైంది. వేయికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఇప్పుడు నేపాల్ దీనిపై రాజకీయాన్ని ప్రారంభించింది. ఘోర వరదలపై ఆ దేశ ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో పరిహారం కోరుతోంది. వరదలకు గ్రీన్ హౌజ్ ఉద్గారాలే కారణమని, ఇందులో భారత్, చైనా, అమెరికాల పాత్ర ఉందని, విపత్తు కారణంగా జరిగిన నష్టానికి క్లైమేట్ కాంపెన్సేషన్ ఇవ్వాలని నేపాల్ డిమాండ్ చేస్తోంది. ఆగస్టు 26న భోటేకోషి నదీ పరివాహక ప్రాంతంలో సంభవించిన భారీ వరదలతో రసువా, నువాకోట్, ధాదింగ్ జిల్లాల్లో తీవ్ర నష్టం జరిగింది. ఇళ్లు, రహదారులు, వంతెనలు, జలవిద్యుత్ ప్రాజెక్టులు దెబ్బతిన్నాయి. నేపాల్ ప్రభుత్వం ఈ విపత్తును ‘హిమాలయన్ సునామీ’గా అభివర్ణించింది.
ఈ వరదల్లో ఇప్పటివరకు 1,127 మంది మరణించగా.. మరో 3,900 మంది ఆచూకీ గల్లంతయ్యారు. నేపాల్, చైనా సరిహద్దుల సమీపంలో కొండరాళ్లు విరిగి పడి వరదలకు కారణమైందని నిపుణులు భావిస్తున్నారు. ఈ విపత్తుపై నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ మాట్లాడుతూ.. వాతావరణ మార్పుల వల్ల ఎక్కువగా నష్టపోతున్న దేశాలకు, కర్బన ఉద్గారాలను విడుదల చేస్తున్న దేశాలు పరిహారం చెల్లించాలని కోరారు. వరదల నష్టాన్ని కేవలం మానవతా సంక్షోభంగా చూడకుండా, వాతావరణ న్యాయం, పరిహారం కోణంలో చూడాలని నేపాల్ కోరుతోంది. ఇది దాతృత్వం కాదని, చట్టపరమైన, నైతిక బాధ్యత అని నేపాల్ తన వాదనని అంతర్జాతీయ స్థాయిలో వినిస్తోంది.
Also Read
- Congress 1000 Days: కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ ఛార్జ్‌షీట్..!
- Ram Mandir Trust First CEO: రామ మందిర ట్రస్ట్ సీఈవో రేసులో ఆ నలుగురు.. తొలి CEOపై తుది నిర్ణయం రేపే..
- Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రా భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. కారణమిదే!
- Nitin Nabin: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన నితిన్ నబిన్
ప్రస్తుతం ప్రపంచంలో గ్రీన్ హౌజ్ ఉద్గారాలు విడుదల చేస్తున్న దేశాల్లో చైనా, అమెరికా, భారత్ అగ్రస్థానాల్లో ఉన్నాయని నేపాల్ వాదిస్తోంది. అయితే, తలసరి ఉద్గారాల విషయంలో భారత అభివృద్ధి చెందిన దేశాల కంటే చాలా తక్కువ స్థాయిలో ఉంది. వరదల నష్టాలపై తమ వాదనల్ని వినిపించేందుకు నేపాల్ ప్రధాని బాలెన్ షా ఐక్యరాజ్య సమితి సాధారణ సమావేశాల్లో పాల్గొనే అవకాశం ఉంది. వరదల వల్ల జరిగిన నష్టం, పునరావాసం, పునర్నిర్మాణం కోసం నేపాల్ ఐక్యరాజ్యసమితి మద్దతుతో పనిచేస్తున్న ‘ఫండ్ ఫర్ రెస్పాండింగ్ టు లాస్ అండ్ డ్యామేజ్’కు అధికారికంగా అభ్యర్థన పంపింది.
తాజావార్తలు
-
Nepal Floods: వరదలకు మీరే కారణం.. భారత్, చైనా, అమెరికాలను టార్గెట్ చేస్తున్న నేపాల్..
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
Ravindra Jadeja: జడేజా చాలా హ్యాండ్సమ్, నా ఫేవరెట్ క్రికెటర్.. ఇంగ్లండ్ దిగ్గజం ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Pawan Kalyan: ఇన్నాళ్లు నాయకులు, పార్టీల కోసం జిందాబాద్ కొట్టాం.. ఇకపై యువత భవిత కోసం జై కొట్టాలి!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
ట్రెండింగ్
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!