Nepal Floods: నేపాల్ వరదల్లో 315 భారతీయుల ఆచూకీ గల్లంతు..

  • నేపాల్ వరదల్లో 315 మంది భారతీయుల ఆచూకీ గల్లంతు..
  • ఇప్పటివరకు 85 మంది భారతీయుల్ని రక్షించిన నేపాల్ సైన్యం..
Nepal (1)

Nepal (1)

Nepal Floods: నేపాల్ వరదల్లో పలువురు భారతీయులు ఆచూకీ లభించడం లేదు. సుమారుగా 315 మంది భారతీయుల ఆచూకీ గల్లంతైనట్లు భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. ఇప్పటి వరకు వివిధ ప్రాంతాల నుంచి 85 మంది భారతీయుల్ని రక్షించినట్లు చెప్పింది. ఇదిలా ఉంటే చైనాలోని టిబెట్ ప్రాంతం నుంచి 93 మంది భారతీయులు నేపాల్ చేరుకున్నారు. నేపాల్ నుంచి ఢిల్లీకి వచ్చిన భారతీయులను విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పలకరించారు.

విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, సుమారు 400 మంది భారత పౌరులు చైనా వైపు చిక్కుకుపోయారని తెలిపారు. వారందరూ సురక్షితంగా ఉన్నారని, తమ కుటుంబాలతో సంప్రదింపులు జరుపుతున్నారని చెప్పారు. బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయం కూడా వారితో సంప్రదింపులు జరుపుతోంది. చాలా మంది కుటుంబాలు హెల్ప్‌లైన్ ద్వారా రాయబార కార్యాలయాన్ని సంప్రదించాయి. అక్కడ నుంచి భారత్ రప్పించేందుకు చైనాలోని స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది.