NEET UG 2027: గుడ్ న్యూసా? బ్యాడ్ న్యూసా?.. నీట్ 2027 ప్యాటర్న్ పూర్తిగా మారబోతోందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NEET UG 2027: దేశవ్యాప్తంగా వైద్య విద్యార్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసే నీట్ యూజీ (NEET UG) ప్రవేశ పరీక్షలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకోనున్నాయి. గత కొన్నేళ్లుగా పేపర్ లీకేజీలు, అవకతవకలు, వివాదాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసేందుకు రంగం సిద్ధమైంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రముఖ ఐటీ దిగ్గజం నందన్ నీలేకణి నేతృత్వంలో ఏర్పాటైన హై-పవర్డ్ టాస్క్ ఫోర్స్, ఇస్రో మాజీ చీఫ్ కె.రాధాకృష్ణన్ కమిటీ అందించిన నివేదికలను పరిగణనలోకి తీసుకుని నీట్ పరీక్షా విధానాన్ని సరికొత్తగా తీర్చిదిద్దుతోంది. 2027 లేదా ఆ తర్వాత నీట్ రాయబోయే విద్యార్థులకు ఈ మార్పులు అత్యంత కీలకంగా మారనున్నాయని తెలుస్తుంది.
పెన్-పేపర్ విధానానికి స్వస్తి..
పేపర్ లీక్‌లకు, ప్రశ్నాపత్రాల లీకేజీలకు శాశ్వతంగా అడ్డుకట్ట వేయాలంటే ఆన్లైన్ పరీక్షే ఏకైక మార్గమని టాస్క్ ఫోర్స్ గట్టిగా భావిస్తోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఆఫ్ లైన్లో జరుగుతున్న నీట్ పరీక్షను పూర్తిగా కంప్యూటర్ ఆధారిత పరీక్షగా (CBT) మార్చడానికి ముమ్మర కసరత్తు జరుగుతోంది. దేశవ్యాప్తంగా ఎలాంటి సాంకేతిక సమస్యలు రాని అత్యాధునిక, అత్యంత సురక్షితమైన పరీక్షా కేంద్రాల మౌలిక వసతులను రేడీ చేస్తున్నారు. అలాగే జేఈఈ మెయిన్ తరహాలోనే నీట్ పరీక్షను కూడా ఏడాదికి ఒకటి కంటే ఎక్కువసార్లు (గరిష్టంగా నాలుగు సార్లు) నిర్వహించాలన్న ప్రతిపాదన కూడా కమిటీ పరిశీలనలో ఉంది. దీనివల్ల విద్యార్థులకు ఒక ప్రయత్నం విఫలమైనా పూర్తి ఏడాది వృథా కాకుండా మరో అవకాశం దక్కుతుంది. మరోవైపు విద్యార్థులపై ఒత్తిడి పెంచుతున్న మితిమీరిన కోచింగ్ సంస్కృతికి అడ్డుకట్ట వేసేందుకు ఇంటర్మీడియట్ (12వ తరగతి) బోర్డు మార్కులకు కూడా నీట్ మెరిట్లో నిర్దిష్ట వెయిటేజీ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నారు.
Also Read
- Supreme Court: యూపీఐ ఛార్జీలపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..
- Tax Raids: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. హీరోయిన్‌పై సంచలన ఆరోపణలు..
- Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
- Boeing 737 MAX Software Glitch: Boeing 737 MAX విమానాల్లో కొత్త సాఫ్ట్వేర్ సమస్య.. ల్యాండింగ్ సమయంలో..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) నిఘా..
పరీక్షా కేంద్రాల్లో మాల్ ప్రాక్టీస్, ఫేక్ అభ్యర్థులకు ఏమాత్రం ఆస్కారం లేకుండా సరికొత్త సాంకేతికతను జోడిస్తున్నారు. అసాధారణ విధానాలను పసిగట్టేందుకు ఏఐ మానిటరింగ్, డేటా అనలిటిక్స్, ఫేస్ రికగ్నిషన్, పూర్తి డిజిటల్ ఫ్రిస్కింగ్ విధానాలను అమలు చేయనున్నారు. సెంటర్లలోకి ప్రవేశించే ముందు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) ద్వారా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయనున్నారు. తాత్కాలిక ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ వ్యవస్థకు వీడ్కోలు పలుకుతూ ఎన్టీఏను శాశ్వత నిపుణుల విభాగాలతో స్వతంత్ర పటిష్ట సంస్థగా రూపాంతరం చేస్తున్నారు. నీలేకణి టాస్క్ ఫోర్స్ తన తొలి నివేదికను సమర్పించనుండగా, 2027 నాటికి ఈ హై-టెక్ సంస్కరణలు పూర్తిస్థాయిలో అమల్లోకి రానున్నాయని తెలుస్తుంది. దీంతో బట్టీ పద్ధతులకు స్వస్తి పలికి, కంప్యూటర్ ఆధారిత విశ్లేషణాత్మక ప్రిపరేషన్‌కు రెడీ కావాల్సిన సమయం విద్యార్థులకు ఆసన్నమైందని విద్యావేత్తలు చెబుతున్నారు.
తాజావార్తలు
-
NEET UG 2027: గుడ్ న్యూసా? బ్యాడ్ న్యూసా?.. నీట్ 2027 ప్యాటర్న్ పూర్తిగా మారబోతోందా?
-
Antera Closed: ఎన్టీవీ ఎఫెక్ట్.. చివరకు మూతపడిన ‘అంతేరా’.!
-
Explainer: సూపర్ ఎల్‌నినో కాటు.. 2.3లక్షల మంది బలి?
-
AP Govt: ఏపీలో మున్సిపల్ కమిషనర్ల బదిలీ.. జీవో జారీ చేసిన ప్రభుత్వం..
-
Khairatabad Bypoll: ఖైరతాబాద్‌కు ఉప ఎన్నిక.. గెజిట్ విడుదల.!
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!