NEET-UG 2024: నేడు నీట్‌పై సుప్రీంకోర్టులో విచారణ..
- నీట్- యూజీ 2024 పరీక్ష పేపర్ లీక్ కావడంతో దేశవ్యాప్తంగా గందరగోళం..
- నీట్ పరీక్షపై దాఖలైన పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టులో విచారణ..
- విచారించనున్న సీజేఐ డీవై చంద్రచూడ్ తో కూడిన త్రిసభ ధర్మాసనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NEET-UG 2024: నీట్- యూజీ 2024 పరీక్ష పేపర్ లీక్ కావడంతో దేశవ్యాప్తంగా గందరగోళం నెలకొంది. దీంతో నీట్–యూజీ 2024 నిర్వహణపై దాఖలైన పిటిషన్లపై ఇవాళ ( సోమవారం) సుప్రీంకోర్టులో విచారణ స్టార్ట్ కాబోతుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల సారథ్యంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం నీట్‌కు సంబంధించి దాఖలైన 38 పిటిషన్లపై వాదనలను విననుంది. అయితే, పరీక్షను క్యాన్సిల్ చేయడం సరైన పద్దతి కాదని.. పేపర్ లీకేజీ భారీ ఎత్తున జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవని ఇప్పటికే సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మే 5వ తేదీన జరిగిన ఈ పరీక్షలో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ విద్యార్థులు, రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇక, పేపర్ లీకేజీ ఆరోపణలపై సీబీఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
Also Read
- Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
- Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
అయితే, ఇప్పటికే నీట్ యూజీ- 2024 పరీక్షకు దాదాపు 24 లక్షల మంది విద్యార్థులు హాజరు కాగా.. ఈ పరీక్షకు సంబంధించి మొత్తం 38 పిటిషన్‌లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. ఈ క్రమంలో అన్ని పిటిషన్లను కలిపి ఈరోజు సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించనుంది. ఇక, మరోవైపు ఈ పరీక్ష క్యాన్సిల్ చేయకూడదని ఇటివల పలువురు విద్యార్థులు గుజరాత్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమకు మంచి మార్కులు వచ్చాయి.. ఎగ్జామ్ రద్దు చేస్తే తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాగే అనేక చోట్ల పరీక్ష రద్దు చేయొద్దని కోరుతూ నిరసన కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 24 లక్షల మంది రాసిన ఈ ఎగ్జామ్ రద్దు విషయంలో సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది.
తాజావార్తలు
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..