Site icon NTV Telugu

అప్ప‌టి వ‌ర‌కూ మాస్క్ పెట్టుకోక త‌ప్ప‌దా…!!

క‌రోనా మ‌హ‌మ్మారి సెకండ్ వేవ్ కాస్త తెరిపించినా దేశంలో ప్ర‌తిరోజూ 30 వేల‌కు పైగా కేసులు న‌మోద‌వుతున్నాయి.  క‌రోనా వ్యాక్సినేష‌న్‌ను వేగ‌వంతం చేయ‌డంతో పాటుగా అన్ని రంగాలు తిరిగి ప్రారంభం కావ‌డంతో మాస్క్‌ను పక్క‌న పెట్టి మామూలుగా తిరిగేస్తున్నారు.  ఇలా చేయ‌డం వ‌ల‌న కేసులు పెరిగే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.  వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌చ్చినా, వేగంగా వ్యాక్సిన్ అమ‌లు చేస్తున్నా త‌ప్ప‌ని స‌రిగా మాస్క్ పెట్టుకోవాల‌ని, లేదంటే వ్యాక్సిన్ తీసుకున్న‌ప్ప‌టికీ క‌రోనా బారిన ప‌డాల్సి వ‌స్తుంద‌ని హెచ్చిరిస్తున్నారు.  ఇండియాలో విజృంభించిన డెల్టా వేరియంట్ ఇప్పుడు ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోంది.  అమెరికా, ఇరాన్‌, ఇండోనేషియా, జ‌పాన్‌, ఆస్ట్రేలియా త‌దిత‌ర దేశాల్లో డెల్టా వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి.  మాస్క్ అవ‌స‌రం లేద‌న్న దేశాలో ఇప్పుడు మాస్క్ పెట్టుకోవాల‌ని సూచిస్తున్నాయి.  2022, డిసెంబ‌ర్ 31 వ‌ర‌కు త‌ప్ప‌ని స‌రిగా మాస్క్ పెట్టుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు.  క‌రోనా వైర‌స్ ఒక‌రి నుంచి మ‌రోక‌రికి సోక‌కుండా ఉండాలి అంటే మాస్క్ ధ‌రించ‌డం త‌ప్ప‌నిస‌రి అని హెచ్చ‌రిస్తున్నారు.  

Read: ఆ ఎద్దు కోసం క‌ద‌లివ‌చ్చిన గ్రామం… ఎందుకంటే…

Exit mobile version