Site icon NTV Telugu

ఆ రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్ అమ‌లుచేయ‌కుంటే…

దేశంలో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి.  ఇక ద‌క్షిణ‌భార‌త‌దేశంలోని క‌ర్ణాట‌క రాష్ట్రంలో ప‌రిస్థ‌తి వేరుగా ఉన్న‌ది.  రోజుకు 50వేల‌కు పైగా కేసులు న‌మోద‌వుతున్నాయి.  కేసులు పెరుగుతుండ‌టంతో ప్ర‌జ‌లు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్క బెంగ‌ళూరు న‌గ‌రంలోనే ఏకంగా 25 వేల‌కు పైగా కేసులు, 200 ల‌కు పైగా మ‌ర‌ణాలు సంభ‌విస్తున్నాయి.  రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్ విధించాల‌ని, లేదంటే క‌ర్ణాట‌క రాష్ట్రంలోని ఇత‌ర జిల్లాల‌కు పెనుముప్పు వాటిల్లే అవ‌కాశం ఉంటుందని ఇండియ‌న్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్  తెలియ‌జేసింది.  రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్ అమ‌లుచేయ‌కుంటే జూన్ నెలాఖ‌రు వ‌ర‌కు ఒక్క బెంగ‌ళూరు న‌గ‌రంలోనే 33 ల‌క్ష‌ల‌కు పైగా కేసులు న‌మోదయ్యే అవ‌కాశం ఉంటుంద‌ని ఇండియ‌న్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ పేర్కోన్న‌ది.  

Exit mobile version