Bihar exit poll: బీహార్ ఎన్నికలు ముగిశాయి. మరో రెండు రోజుల్లో ఫలితాలు తెలుస్తాయి. అయితే, ఇప్పటికే అనేక ఎగ్జిట్ పోల్స్ బీహార్‌లో మరోసారి బీజేపీ+జేడీయూల ఎన్డీయే అధికారంలోకి వస్తుందని చెప్పాయి. తాజాగా, యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ కూడా ఇదే విషయాన్ని చెప్పింది. కానీ, తక్కువ మార్జిన్‌తో ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. బీహార్ అసెంబ్లీలో 243 సీట్లు ఉన్నాయి, ప్రభుత్వ ఏర్పాటుకు 122 మ్యాజిక్ ఫిగర్. ఎన్డీయే 121-141 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు చెప్పింది. ప్రతిపక్ష ఆర్జేడీ+కాంగ్రెస్‌ల మహాఘట్బంధన్ 98-118 సీట్లు గెలుచుకుంటుందని వెల్లడించింది.
Read Also: Delhi Blast: ఢిల్లీ పేలుళ్లలో రెండవ మహిళా ఉగ్రవాది.. అఫిరా బీబీ ఎవరు?
ఈసారి బీహార్ ఎన్నికల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచిన ప్రశాంత్ కిషోర్ జన్ సురాజ్ పార్టీ 0-1 సీటు గెలుచుకోవచ్చని చెప్పింది. 2020లో 37 శాతం ఓట్లు పొందిన ఎన్డీయే ఈ సారి 43 శాతం ఓట్లు సాధించే అవకాశం ఉందని, మహాఘట్బంధన్ 41 శాతం ఓట్లు సంపాదించే అవకాశం ఉందని చెప్పింది. బీహార్ లో యాదవులు, ముస్లింలు ఆర్జేడీ నేతృత్వంలోని మహాఘట్బంధన్ కూటమికి మద్దతు నిలువగా, ఎన్డీయేకు యాదవేతర బీసీలు, ఓసీలు, ఈబీసీలు, ఎస్టీలు అండగా నిలిచినట్లు సర్వే వెల్లడించింది.
