Site icon NTV Telugu

NDA: ప్రభుత్వ ఏర్పాటుకు రాష్ట్రపతిని కలువనున్న ఎన్డీయే నేతలు..

Nda

Nda

NDA: ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్డీయే పక్షాలు సంసిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఎన్డీయే భాగస్వామ పక్ష నేతలు ప్రధాని నరేంద్రమోడీ ఇంట్లో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి బీహార్ సీఎం, జేడీయూ నేత నితీష్ కుమార్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్‌తో పాటు పలువురు నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఎన్డీయేలో బీజేపీతో పాటు 15 పార్టీలు ఉన్నాయి. టీడీపీ, జేడీఎస్, ఆర్ఎల్డీ, సిక్కిం క్రాంతికారి మోర్చా, జనసేన, హిందూస్తానీ ఆవామీమోర్చా, అప్నాదళ్, అస్సాం గణపరిషత్, శివసేన(షిండే), అజిత్ పవార్(ఎన్సీపీ), జేడీయూ వంటి పార్టీలు ఉన్నాయి.

Read Also: Ravindra Jadeja: రవీంద్ర జడేజా పై తీవ్ర ఆరోపణలు చేసిన ఆకాశ్ చోప్రా..

ప్రస్తుతం మోడీ నేతృత్వంలో ఎన్డీయే సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ కూడా హాజరయ్యారు. ఈ సమావేశం అనంతరం ఎన్డీయే నేతలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలవనున్నట్లు తెలుస్తోంది. ఈ రోజే నరేంద్రమోడీ, అమిత్ షా, చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ కలిసి రాష్ట్రపతిని కలువనున్నట్లు సమాచారం. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతారని సమాచారం.

ఇప్పటికే కొత్త ప్రభుత్వ ఏర్పాటు కోసం రాష్ట్రపతిని కలిసిన మోడీ తన ప్రధాని పదవికి రాజీనామా చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యే వరకు ఆపద్ధర్మ ప్రధానిగా ఉండాలని ఆమె కోరారు. జూన్ 8న ప్రధానిగా మూడోసారి నరేంద్రమోడీ ప్రమాణస్వీకారం చేయనున్నారు. జూన్ 7న బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించి, తమ నాయకుడిగా నరేంద్రమోడీని ఎన్నుకోనున్నారు.

Exit mobile version