Site icon NTV Telugu

No-Trust Motion: జగదీప్ ధంఖర్‌పై అవిశ్వాస తీర్మానం.. మాకే మెజారిటీ ఉందన్న కిరణ్ రిజిజు..

Kiren Rijiju

Kiren Rijiju

No-Trust Motion: రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధంఖర్‌పై ప్రతిపక్ష పార్టీలు ‘అవిశ్వాస తీర్మానం’ తీసుకువచ్చేందుకు సిద్ధమయ్యా యి. ఈ తీర్మానానికి మద్దతుగా 50 మంది ఎంపీలు సంతకం చేశారు. అయితే, ఈ తీర్మాణంపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభ ఛైర్మన్‌ తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడని ప్రతిపక్షాలు ఆరోపించాయి.

Read Also: Students Missing in Vizag: ‘లక్కీ భాస్కర్‌’ సినిమా చూశారు.. 9వ తరగతి విద్యార్థులు అదృశ్యమయ్యారు..!

కాంగ్రెస్ తీసుకువచ్చిన ఈ తీర్మానానికి మద్దతుగా టీఎంసీ, ఆప్, సమాజ్‌వాదీ ఎంపీలు సంతకాలు చేశారు. దీనిపై కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. ‘‘రాజ్యసభలో ఎన్డీయేకి మెజారిటీ ఉందని, నోటీసులు తప్పనిసరిగా తిరస్కరించబడాలి, తిరస్కరించబడుతుంది. ఈ విధమైన చర్యలను ఆమోదించకుండా చూస్తాము’’ అని అన్నారు.

యూఎస్ బిలియనీర్ జార్జ్ సోరోస్‌తో కాంగ్రెస్‌కి సంబంధం ఉందని బీజేపీ ఆరోపిస్తోంది. మోడీ ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు యూఎస్ డీప్‌స్టే్‌ట్‌లో కీలక వ్యక్తిగా ఉన్న సోరోస్‌తో కాంగ్రెస్‌కి ఏంటి సంబంధం అని బీజేపీ నేతలు ప్రశ్నించారు. దీనిపై రాజ్యసభలో చర్చకు ధంఖర్ అనుమతించడంతో వివాదం మొదలైంది. దీని తర్వాతే ప్రతిపక్షం అవిశ్వా తీర్మానంపై నిన్న నిర్ణయం తీసుకుంది. వివిధ అంశాలపై చర్చించాలని కోరుతూ.. తమ నోటీసులకు తిరస్కరించిన ఛైర్మన్, అధికార సభ్యులను ఎలా అనుమతిస్తారని ప్రతిపక్ష కాంగ్రెస్ ప్రశ్నించింది.

Exit mobile version