Site icon NTV Telugu

కరోనా దూకుడు… శరద్ పవార్ కి కోవిడ్ పాజిటివ్

దేశంలో కరోనా వీరవిహారం చేస్తూనే వుంది. వీఐపీలు ఎవరినీ కోవిడ్ మహమ్మారి వదలడం లేదు. రాజకీయ రంగంలోనూ కరోనా వ్యాప్తి అధికమైంది. దేశంలో 3,06,064 కేసులు న‌మోద‌య్యాయి. నిన్న‌టి కంటే ఈరోజు 27,469 కేసులు త‌క్కువ‌గా న‌మోదుకావ‌డం ఊర‌ట‌నిచ్చేవిష‌యం. ఇక గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో క‌రోనాతో 439 మంది మృతి చెందిన‌ట్టు కేంద్ర ఆరోగ్య‌శాఖ స్ప‌ష్టం చేసింది. ఇక‌, 24 గంట‌ల్లో 2,43,495 మంది కోలుకున్నారు. దేశంలో ప్ర‌స్తుతం 22,49,335 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. దేశంలో పాజిటివిటీ రేటు 20.75 శాతంగా ఉంది.

https://ntvtelugu.com/railway-budget-will-double-this-year/

తాజాగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు కరోనా పాజిటివ్ అని తేలింది. తనకు కరోనా సోకిందని శరద్ పవార్ తెలిపారు. అయితే, ఆందోళన చెందనక్కర్లేదని వెల్లడించారు. తనతో కాంటాక్ట్ అయినవారు టెస్టులు చేయించుకోవాలని కోరారు. డాక్టర్లు సూచించిన మేరకు చికిత్స పొందుతున్నానని తెలిపారు. దేశంలో కరోనా తీవ్రంగా వుందన్నారు. ప్రజలు తప్పనిసరిగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని శరద్ పవార్ సూచించారు.

Exit mobile version