NTV Telugu Site icon

Naveen Patnaik: విపక్షాలకు షాక్.. పార్లమెంట్ ప్రారంభోత్సవానికి హాజరవుతామన్న బీజేడీ..

Naveen Patnaik

Naveen Patnaik

Naveen Patnaik: పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవం దేశవ్యాప్తంగా రాజకీయంగా రచ్చరచ్చగా మారింది. ఇప్పటికే ఈ ప్రారంభోత్సవానికి 19 ప్రతిపక్ష పార్టీలు బహిష్కరించాయి. కాంగ్రెస్ తో పాటు కమ్యూనిస్ట్ పార్టీలు, డీఎంకే, టీఎంసీ, ఆప్ వంటి పార్టీలు ప్రారంభోత్సవానికి రాబోమని చెప్పాయి. ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా మే 28న కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం జరగనుంది. అయితే రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కాదని ప్రధాని కొత్త భవనాన్ని ప్రారంభించం ఏంటని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

ఇదిలా ఉంటే జిజూ జనతాదళ్ (బీజేడీ) పార్టీ, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఆదివారం రోజున కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవంలో పాల్గొంటామని స్పష్టం చేశాయి. ఈ కార్యక్రమానికి హాజరు అవుతున్నట్లు ప్రకటించిన ఎన్డీయేతర పార్టీల్లో బీజేడీ ఒకటి. ఇప్పటికే అకాలీదళ్ పార్టీ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు తెలిపింది.

Read Also: Harish Shanker: రిపోర్టర్ కు పేలింది.. స్టేజి మీదనే ఇచ్చిపడేసిన డైరెక్టర్

‘‘భారత రాష్ట్రపతి భారత రాష్ట్రానికి అధిపతి. పార్లమెంటు భారతదేశంలోని 1.4 బిలియన్ల ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. రెండు సంస్థలు భారత ప్రజాస్వామ్యానికి చిహ్నాలు మరియు భారత రాజ్యాంగం నుండి తమ అధికారాన్ని పొందుతాయి. ఈ రాజ్యాంగ సంస్థలు తమ పవిత్రత మరియు గౌరవాన్ని ప్రభావితం చేసే ఏదైనా సమస్యకు అతీతంగా ఉండాలని బీజేడీ విశ్వసిస్తుంది. అటువంటి సమస్యలపై ఆగస్ట్ హౌస్‌లో ఎల్లప్పుడూ చర్చ జరగవచ్చు. అందువల్ల ఈ ముఖ్యమైన సందర్భంలో బీజేడీ భాగం అవుతుంది’’ అని ప్రకటించింది.

కొత్త పార్లమెంట్ భవనం లోక్ సభలో 888 మంది, రాజ్యసభలో 300 మంది వరకు సౌకర్యవంతంగా కూర్చునేలా నిర్మించారు. ఉభయసభల్లో మొత్తంగా 1280 మంది సభ్యులు కూర్చునేందుకు అనువుగా భవనాన్ని నిర్మించారు. ప్రధాని మోడీ దీనికి డిసెంబర్ 2020లో శంకుస్థాపన చేశారు. మే 28న ఈ భవనాన్ని ప్రారంభించనున్నారు.

Show comments