భారతదేశ వ్యాప్తంగా దేవి నవరాత్రులు జరుగుతున్న సంగతి తెలిసిందే.. ఒక్కో ప్రాంతంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరిస్తూన్నారు.. అమ్మవారిపై తమకున్న భక్తిని ప్రత్యేక అలంకరణ లో చూపిస్తున్నారు భక్తులు.. మొన్న ఏమో గాజులతో అలంకరణను చూసాము.. నిన్న పానీపూరితో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. అందుకు సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.. ఇప్పుడు తాజాగా మరో వీడియో వైరల్ అవుతుంది..
ఎటువంటి అంచనాలు లేకుండా థియేటర్లలో విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సినిమా కాంతార.. ఈ సినిమాలోని స్వామి అవతారం జనాలను బాగా ఆకట్టుకుంది.. కన్నడ ప్రజల సంప్రదాయమైన భూత కోల నేపథ్యంలో ఈ తెరకెక్కింది. ఈ మూవీ కేవలం 16 కోట్లతో తెరకెక్కించగా దాదాపు 450 కోట్ల వరకు వసూల్ చేసింది… సీక్వెల్ సినిమా కూడా రాబోతుంది..ఈ కాంతార థిమ్ తో వినాయక చవితి ప్రత్యేక అలంకరణ చేశారు. అలాగే ఇప్పుడు దసరా సందర్భంగా దుర్గ మాతను కూడా కాంతార థీమ్ తో చేశారు. ఎక్కడంటే. కలకత్తా మహానగరం లో దసరా పండగను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారన్న విషయం తెలిసిందే..
కాగా, కోల్‌కతాలో కాంతార థీమ్‌లో దుర్గా పూజ నిర్వహించారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ‘ పశ్చిమ బెంగాల్‌లో నవరాత్రి ఉత్సవాలను ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. పెద్ద పెద్ద నగరాల్లో అన్ని వీధుల్లో దుర్గాదేవిని నెలకొలిపి పూజలు చేస్తుంటారు. తాజాగా అక్కడి ప్రజలు ‘కాంతారా’ థీమ్‌తో దుర్గాపూజ చేశారు. అమ్మవారి మండపాన్ని కాంతారా థీమ్‌తో అలంకరించారు.. అచ్చం కాంతార సినిమాను మరోసారి చూపించారు. అందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఎంత అందంగా ఉందో ఒక్కసారి చూడండి..