NTV Telugu Site icon

Naukri survey On IT Layoffs: ఈ ఏడాది ఫస్ట్ హాఫ్‌లో ఉద్యోగాల తొలగింపు తక్కువే.. వీరి ఉద్యోగాలు ఊడే అవకాశం..

It Layoffs

It Layoffs

Naukri survey On IT Layoffs: ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం, ఆర్థికమాంద్య భయాలు ఐటీ కంపెనీలను భయపెడుతున్నాయి. ఇప్పటికే దిగ్గజ ఐటీ కంపెనీలు గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ట్విట్టర్, డెల్, విప్రో వంటివి ఇప్పటివరకే వేల సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి పంపాయి. అయితే ఇప్పటి వరకు ఎక్కువ ప్రభావితం అయింది మాత్రం అమెరికాలో పనిచేస్తున్నవారే. అయితే రానున్న కాలంలో ఇండియాలో కూడా ఉద్యోగాల తొలగింపు ఉండే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు. దీంతో ఇండియన్ ఐటీ నిపుణుల్లో ఆందోళన నెలకొంది.

ఇదిలా ఉంటే ప్రముఖ జాబ్ పోర్టల్ నౌకరీ. కామ్ మాత్రం భారతీయ ఐటీ నిపుణులకు సానుకూల వార్త వెల్లడించింది. తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో 2023 ప్రథమార్థంలో కేవలం కొన్ని ఉద్యోగాలు మాత్రమే పోయే అవకాశం ఉందని వెల్లడించింది. ముఖ్యంగా సీనియర్ల పైనే ఎక్కువగా ప్రభావం ఉంటుందని అంచనా వేసింది. ఇదే సమయంలో భారతీయ ఐటీ ఉద్యోగులకు గణనీయంగా ఇంక్రిమెంట్లు ఉండే అవకాశం ఉందని సర్వే పేర్కొంది. ఇంక్రిమెంట్లు దాదాపుగా 20 శాతం ఉంటుందని తెలిపింది.

Read Also: K Laxman: కేసీఆర్ కలలు కంటున్నాడు.. కొత్త డ్రామా మొదలుపెట్టారు

నౌకరీ.కామ్ ఇటీవల 1400 మంది రిక్రూటర్లు, కన్సల్టెంట్లపై సర్వే నిర్వహించింది. చాలా మంది రిక్రూటర్లు 2023 తొలి భాగంలో ఉద్యోగుల తొలగింపులు తక్కువగానే ఉంటాయని అంచానా వేసింది. అయితే 4 శాతం మంది మాత్రం తమ సంస్థల్లో ఉద్యోగుల తొలగింపు ప్రధానంగా ఉంటుందని వెల్లడించింది. ముఖ్యంగా సీనియర్ నిపుణులను నియమించుకోవడం తగ్గుతుందని.. బిజినెస్ డెవలప్మెంట్, మార్కెటింగ్, హ్యూమన్ రిసోర్సెస్ విభాగాలపై ప్రభావం పడే అవకాశం ఉందని సర్వే పేర్కొంది. 20 శాతం మంది రిక్రూటర్లు సీనియర్ల ఉద్యోగాలే ఊడుతాయని అంచానా వేశారు. ప్రెషర్లపై తక్కువ ప్రభావం పడే ఛాన్సుందని తెలిపారు.

ఈ ఏడాది ఫస్ట్ హాఫ్ లో కేవలం 15 శాతం అట్రిషన్ రేట్ ఉంటుందని, ఐటీ ఉద్యోగాలే టాప్ లో ఉంటాయని ప్రభావితం అవుతాయని సర్వే తెలిపింది. 92 శాతం మంది రిక్రూటర్లు ఈ ఏడాది తొలిభాగంలో నియామకాలు సానుకూలంగానే ఉంటాయని, 29 శాతం మంది మాత్రం కొత్త ఉద్యోగాల క్రియేషన్ మాత్రమే ఉంటుందని సర్వేలో తెలిపారు. 17 శాతం మంది తమ ఉద్యోగులను మెంటైన్ చేయాలని చూస్తున్నట్లు అంచానా వేశారు.