NTV Telugu Site icon

Madras High Court: ప్రేమలో ఉన్న టీనేజర్లు కౌగిలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం సహజం..

Madras High Court

Madras High Court

Madras High Court: టీనేజ్ ప్రేమని నేరంగా పరిగణించలేమని పేర్కొంటూ లైంగిక వేధింపులకు పాల్పడిన కేసును ఎదుర్కొంటున్న యువకుడిపై క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ని రద్దు చేస్తూ మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ తీర్పు చెప్పింది. జస్టిన్ ఎన్ ఆనంద్ వెంకటేష్‌తో కూడిన ధర్మాసనం నవంబర్ 4 నాటి ఉత్తర్వుల్లో.. యువకుడు, యువతి మధ్య శారీరక సంబంధం ఇద్దరి మధ్య ఏకాభిప్రాయ సంబంధంలో సహజమైన పరస్పర చర్య అని తీర్పు చెప్పింది. ఐపీసీ సెక్షన్ 354-A(1)(i) ప్రకారం ఇది నేరానికి అర్హమైనంది కాదని పేర్కొంది.

ఏకాంత ప్రదేశంలో జరిగిన మీటింగ్‌లో తనతో ప్రేమ వ్యవహారం నడిపిన వ్యక్తి, తనను కౌగిలించుకుని ముద్దుపెట్టుకున్నాడని ఆరోపిస్తూ 19 ఏళ్ల యువతి ఫిర్యాదు చేసింది. యువకుడు పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటనపై ఐపీసీ 354-A(1)(i) కేసు నమోదు చేశారు. ఈ సెక్షన్ ప్రకారం నమ్మించి లైంగికంగా వాడుకోవడం, శారీరక సంబంధాన్ని పెట్టుకోవడం వంటివి క్రిమినర్ నేరంగా పరిగణిస్తాయి.

Read Also: తమ భార్యల కంటే తక్కువ వయస్సు ఉన్న భారతీయ క్రికెటర్లు వీళ్లే..

అయితే, తాజా కేసులో ఈ సెక్షన్ కింద క్రిమినల్ నేరంగా పరిగణించే అంశాలు లేవని కోర్టు గుర్తించింది. ఇద్దరు కూడా యుక్తవయసు చివరిలో ఉన్నారరని, ఇష్టపూర్వకంగా కలుసుకున్నారని, కలిసి గడిపారని కోర్టు పేర్కొంది. ఆరోపించిన చర్యలు ఏదైనా నేరపూరిత ఉద్దేశ్యం కన్నా, యువ జంట యొక్క విలక్షణమైన ప్రేమను ప్రతిబింబిస్తున్నాయని జస్టిస్ వెంకటేష్ పేర్కొన్నారు. “టీనేజ్‌లో ప్రేమ వ్యవహారం సాగిస్తున్న ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు కౌగిలించుకోవడం లేదా ముద్దు పెట్టుకోవడం చాలా సహజం. ఇది IPC సెక్షన్ 354-A(1)(i) ప్రకారం నేరంగా పరిగణించబడదు.” అని చెప్పారు.

ఇలాంటి కేసులను కొనసాగించడం వల్ల ఏకాభిప్రాయంతో సంబంధాలు పెట్టుకునే యువతపై అనవసరమైన కళంకం ఏర్పడుతుందని ఆయన చెప్పారు. పోలీసులు తమ విచారణను పూర్తి చేసి శ్రీవైగుండం జ్యుడీషియల్ మేజిస్ట్రేట్‌కి తుది నివేదిక సమర్పించిన తర్వాత కోర్టు జోక్యం చేసుకుంది. హైకోర్టు తన అధికార పరిధిని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 482 ప్రకారం ఉపయోగించుకుంది, ఇది న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేయకుండా నిరోధించడానికి క్రిమినల్ ప్రొసీడింగ్‌లను రద్దు చేయడానికి అనుమతిస్తుంది. ఒక కేసు విచారణకు వచ్చినప్పటికీ, వాటిని కొనసాగించడం వల్ల అన్యాయం జరుగుతుందని, విచారణ రద్దు చేసే అధికారం హైకోర్టుకు ఉంటుందని న్యాయమూర్తి చెప్పారు.

Show comments