Integrated BEd: 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సుకు జాతీయ ఎంట్రన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Integrated BED: దేశంలో 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సులో ప్రవేశాల కోసం ఈ ఏడాది నుంచి జాతీయ ఎంట్రన్స్ ను నిర్వహించనున్నారు. ఈ ఎంట్రన్స్ ను జాతీయ పరీక్షల మండలి(ఎన్‌టీఏ) నిర్వహించనుంది. దేశంలో 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సును ఈ ఏడాది నుంచి ఎన్‌ఐటీలు, సెంట్రల్ యూనివర్సిటీలతోపాటు రాష్ట్రాలకు చెందిన డిగ్రీ కాలేజీల్లోనూ అమలు చేయనున్నారు. అయితే వాటిలో ప్రవేశాల కోసం మాత్రం జాతీయ స్థాయిలోనే ప్రవేశ పరీక్షను నిర్వహించి అడ్మిషన్లను చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. అందులో భాగంగా 2023-24 విద్యా సంవత్సరంకు సంబంధించి ప్రవేశ పరక్ష షెడ్యూల్‌ను ఎన్‌టీఏ ప్రకటించింది.
Read also: WhatsApp LPG Gas Booking: వాట్సప్‌లో ఒక్క మెసేజ్ పెడితే చాలు.. గ్యాస్ సిలిండర్ ఇంటికి వచ్చేస్తుంది!
Also Read
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
- Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
- Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సును దేశ వ్యాప్తంగా 2023-24 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయనున్నారు. ఇందులో ప్రవేశాల కోసం నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఎన్‌సీఈటీ)-2023 ను నిర్వహిస్తారు. ఈ పరీక్షను ఎన్‌టీఏ నిర్వహించనుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను ఎన్‌టీఏ జారీ చేసింది. దరఖాస్తుల ప్రక్రియను జులై 19 వరకు కొనసాగించనున్నారు. జులై 21, 22 తేదిల్లో దరఖాస్తు చేసిన వాటిలో తప్పులను సరి చేసుకోవడానికి అవకాశం కల్పించారు. దేశ వ్యాప్తంగా 178 నగరాల్లో పరీక్షను నిర్వహించనున్నారు. మొత్తం ప్రాంతీయ భాషలతో కలిపి 13 భాషల్లో పరీక్షను నిర్వహించనున్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను పరీక్షకు మూడు రోజుల ముందునుంచి డౌన్‌లోడ్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. పరీక్ష తేది, సమయాన్ని త్వరలో ప్రకటించనున్నారు. 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సును ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్(ఐటీఈపీ) పేరుతో కొనసాగనుంది.
Read also: Big Pay Hike: టీచర్లకు గుడ్‌న్యూస్.. భారీ వేతన పెంపును ప్రకటించిన సర్కారు!
తెలంగాణ రాష్ర్టంలో 3 విద్యా సంస్థల్లో 4 సంవత్సరాల బీఈడీ కోర్సుకు ప్రవేశాలకు అవకాశం కల్పించారు. హైదరాబాద్‌లోని ఉర్థూ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో, వరంగల్‌లోని ఎన్‌ఐటీలో, అలాగే
మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో అడ్మిషన్లకు అవకాశం కల్పించారు. హైదరాబాద్‌లోని ఉర్థూ సెంట్రల్ యూనివర్సిటీలో మూడు కోర్సులకు అవకాశమిచ్చారు. బీఎస్సీ బీఈడీ, బీఏ బీఈడీ, బీకామ్ బీఈడీ కోర్సులకు అవకాశం ఇచ్చారు. ఒక్కో కోర్సులో 50 సీట్లకు అనుమతి ఇచ్చారు. వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎన్‌ఐటీ)లో బీఎస్సీ బీఈడీ కోర్సుకు అనుమతి ఇవ్వగా 50 సీట్లను భర్తీ చేయనున్నారు. ఇక మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో బీఈ బీఈడీ కోర్సుకు అనుమతి ఇచ్చారు. ఇందులో 50 సీట్లను భర్తీ చేయనున్నారు.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!