NTV Telugu Site icon

Integrated BEd: 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ కోర్సుకు జాతీయ ఎంట్రన్స్

Bed

Bed

Integrated BED: దేశంలో 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ కోర్సులో ప్రవేశాల కోసం ఈ ఏడాది నుంచి జాతీయ ఎంట్రన్స్ ను నిర్వహించనున్నారు. ఈ ఎంట్రన్స్ ను జాతీయ పరీక్షల మండలి(ఎన్‌టీఏ) నిర్వహించనుంది. దేశంలో 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ కోర్సును ఈ ఏడాది నుంచి ఎన్‌ఐటీలు, సెంట్రల్‌ యూనివర్సిటీలతోపాటు రాష్ట్రాలకు చెందిన డిగ్రీ కాలేజీల్లోనూ అమలు చేయనున్నారు. అయితే వాటిలో ప్రవేశాల కోసం మాత్రం జాతీయ స్థాయిలోనే ప్రవేశ పరీక్షను నిర్వహించి అడ్మిషన్లను చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. అందులో భాగంగా 2023-24 విద్యా సంవత్సరంకు సంబంధించి ప్రవేశ పరక్ష షెడ్యూల్‌ను ఎన్‌టీఏ ప్రకటించింది.

Read also: WhatsApp LPG Gas Booking: వాట్సప్‌లో ఒక్క మెసేజ్ పెడితే చాలు.. గ్యాస్ సిలిండర్‌ ఇంటికి వచ్చేస్తుంది!

4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ కోర్సును దేశ వ్యాప్తంగా 2023-24 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయనున్నారు. ఇందులో ప్రవేశాల కోసం నేషనల్‌ కామన్‌ ఎంట్రన్స్ టెస్ట్(ఎన్‌సీఈటీ)-2023 ను నిర్వహిస్తారు. ఈ పరీక్షను ఎన్‌టీఏ నిర్వహించనుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను ఎన్‌టీఏ జారీ చేసింది. దరఖాస్తుల ప్రక్రియను జులై 19 వరకు కొనసాగించనున్నారు. జులై 21, 22 తేదిల్లో దరఖాస్తు చేసిన వాటిలో తప్పులను సరి చేసుకోవడానికి అవకాశం కల్పించారు. దేశ వ్యాప్తంగా 178 నగరాల్లో పరీక్షను నిర్వహించనున్నారు. మొత్తం ప్రాంతీయ భాషలతో కలిపి 13 భాషల్లో పరీక్షను నిర్వహించనున్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ అడ్మిట్‌ కార్డులను పరీక్షకు మూడు రోజుల ముందునుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. పరీక్ష తేది, సమయాన్ని త్వరలో ప్రకటించనున్నారు. 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ కోర్సును ఇంటిగ్రేటెడ్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ ప్రోగ్రామ్‌(ఐటీఈపీ) పేరుతో కొనసాగనుంది.

Read also: Big Pay Hike: టీచర్లకు గుడ్‌న్యూస్‌.. భారీ వేతన పెంపును ప్రకటించిన సర్కారు!

తెలంగాణ రాష్ర్టంలో 3 విద్యా సంస్థల్లో 4 సంవత్సరాల బీఈడీ కోర్సుకు ప్రవేశాలకు అవకాశం కల్పించారు. హైదరాబాద్‌లోని ఉర్థూ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో, వరంగల్‌లోని ఎన్‌ఐటీలో, అలాగే
మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో అడ్మిషన్లకు అవకాశం కల్పించారు. హైదరాబాద్‌లోని ఉర్థూ సెంట్రల్‌ యూనివర్సిటీలో మూడు కోర్సులకు అవకాశమిచ్చారు. బీఎస్సీ బీఈడీ, బీఏ బీఈడీ, బీకామ్‌ బీఈడీ కోర్సులకు అవకాశం ఇచ్చారు. ఒక్కో కోర్సులో 50 సీట్లకు అనుమతి ఇచ్చారు. వరంగల్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఎన్‌ఐటీ)లో బీఎస్సీ బీఈడీ కోర్సుకు అనుమతి ఇవ్వగా 50 సీట్లను భర్తీ చేయనున్నారు. ఇక మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో బీఈ బీఈడీ కోర్సుకు అనుమతి ఇచ్చారు. ఇందులో 50 సీట్లను భర్తీ చేయనున్నారు.

Show comments