NTV Telugu Site icon

Mehbooba Mufti: కాశ్మీర్ నేత మహబూబా ముఫ్తీకి తప్పిన ముప్పు..

Mehbooba Mufti

Mehbooba Mufti

Mehbooba Mufti: జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ పార్టీ అధినేత మహబూబా ముఫ్తీ తృటిలో భారీ ప్రమాదం నుంచి బయటపడ్డారు. గురువారం మధ్యాహ్నం ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటన అనంత్‌నాగ్ జిల్లాలోని సంగమ్ వద్ద జరిగింది. ఎదురుగా వస్తు్న్న కారును, ముఫ్తీ ప్రయాణిస్తున్న స్కార్పియో ఢీకొట్టింది.

Read Also: Indore: క్లీనెస్ట్ సిటీగా వరసగా ఏడోసారి ఇండోర్.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ సిటీలకు చోటు..

ఈ ఘటనలో ముఫ్తీకి ఎలాంటి గాయాలు కాలేదు. అగ్నిప్రమాదంలో బాధితులను పరామర్శించేందుకు ఆమె ఖానాబాల్ వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఆమె వ్యక్తిగత సిబ్బందిలో ఉన్న పోలీస్ అధికారికి గాయాలయ్యాయి. నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా స్పందిస్తూ.. ఆమెకు ఎలాంటి గాయాలు కాకుండా బయటపడటం సంతోషంగా ఉందని ట్వీట్ చేశారు. ‘‘ఈరోజు అనంత్‌నాగ్‌లో ప్రయాణిస్తున్న శ్రీమతి ముఫ్తీ కారు ఘోర ప్రమాదానికి గురైంది. దేవుడి దయ వల్ల ఆమెతో పాటు ఆమె భద్రతా అధికారులు ఎటువంటి తీవ్రమైన గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారు’’ అని ముఫ్తీ కూతురు ఇల్తిజా ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు.