Mamata Banerjee: మమతా బెనర్జీకి బిగ్ షాక్.. నందిగ్రామ్ పోటీ నుంచి అభ్యర్థి విత్‌డ్రా..
- మమతా బెనర్జీకి భారీ షాక్..
- నందిగ్రామ్ ఉప ఎన్నికల అభ్యర్థి విత్ డ్రా..
- సీఎం సువేందుతో భేటీ తర్వాత సంచితా ప్రధాన్ కీలక నిర్ణయం..
- ఇటీవల సంచితా అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన మమతా.
- సీఎంతో భేటీ తర్వాత గంటల్లోనే కీలక పరిణామం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamata Banerjee: ఇప్పటికే పార్టీని, ఎన్నికల గుర్తును కోల్పోయిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, మాజీ సీఎం మమతా బెనర్జీకి బిగ్ షాక్ తగిలింది. రాబోయే నందిగ్రామ్ ఉప ఎన్నికల బరి నుంచి మమతా వర్గం అభ్యర్థి విత్ డ్రా అయ్యారు. నందిగ్రామ్ బై ఎలక్షన్స్ కోసం మమతా వర్గం తమ అభ్యర్థిగా సంచితా ప్రధాన్ డే అనే మహిళా టీచర్‌ను ప్రకటించారు. అయితే, ఆమె పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారితో భేటీ అయిన కొన్ని గంటల్లోనే తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. సువేందుతో భేటీ తర్వాత ఎన్నికల పోటీ నుంచి బయటకు రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు, మమతా బెనర్జీకి రాజకీయ తలనొప్పులు మరింత ఎక్కువయ్యాయి. ఇప్పటికే టీఎంసీలో వర్గ పోరు తీవ్రమైంది. ఈ నేపథ్యంలో ఈసీ టీఎంసీ పేరు, ఎన్నికల గుర్తును ఫ్రీజ్ చేసింది. మమతా వర్గానికి ‘‘ఫుట్‌బాల్ ప్లేయర్’’ గుర్తు, రిటబ్రత బెనర్జీ నేతృత్వంలోని తిరుగుబాటు వర్గానికి ‘‘ఎన్వలప్ కవర్’’ గుర్తును కేటాయించింది. ఈ గుర్తులపైనే రెండు వర్గాలు ఉప ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాయి. ఈసీ ఈ గుర్తుల కేటాయింపు చేసిన కొన్ని గంటల్లోనే మమతాకు సంచితా బిగ్ షాక్ ఇచ్చారు.
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
- Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
ఈ ఏడాది జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఘోర పరాజయం చవిచూసింది. మమతా బెనర్జీ భవానీపూర్ నుంచి ఓడిపోయారు.ఈ స్థానం నుంచి పోటీ చేసిన సువేందు అధికారి మమతను చిత్తుగా ఓడించారు. సువేందు భవానీపూర్‌తో పాటు నందిగ్రామ్ నుంచి పోటీ చేసి రెండు చోట్ల విజయం సాధించారు. ఎన్నికల తర్వాత భవానీపూర్ నుంచి ఎమ్మెల్యేగా కొనసాగడానికే ఇష్టపడి, నందిగ్రామ్‌కు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో నందిగ్రామ్‌కు బైఎలక్షన్లు అనివార్యమయ్యాయి. టీఎంసీ ఘోర పరాజయం తర్వాత వర్గపోరు ముదిరింది.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!