NTV Telugu Site icon

Bihar: బీహార్ కొత్త స్పీకర్‌గా నంద కిషోర్

Bihar New Spekar

Bihar New Spekar

బీహార్‌ అసెంబ్లీలో (Bihar) సోమవారం జరిగిన బలపరీక్షలో నితీష్‌కుమార్ సర్కార్ (Nitish Kumar) విజయం సాధించింది. 129 మంది ఎమ్మెల్యేలు నితీష్‌కు మద్దతుగా నిలిచారు. ఇక కొత్త స్పీకర్‌గా బీజేపీ నేత నంద కిషోర్ యాదవ్ (Nand Kishore Yadav )పేరు ఖరారైంది. మంగళవారం ఆయన బాధ్యతలు తీసుకోనున్నారు.

ఇదిలా ఉంటే నితీష్ కుమార్ బలపరీక్షకు ముందు మహాకూటమిలో స్పీకర్‌గా ఉన్న ఆర్జేడీకి చెందిన అవథ్ బిహారీ చౌదరి‌పై అధికార పక్షం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. తీర్మానానికి అనుకూలంగా 125 ఓట్లు, వ్యతిరేకంగా 112 ఓట్లు పడటంతో స్పీకర్‌కు ఉద్వాసన పలికారు. దీంతో కొత్త స్పీకర్ నియామకానికి మార్గం సుగమమైంది. కీలకమైన స్పీకర్ పదవిని బీజేపీ దక్కించుకోవడం విశేషం.

నితీష్ కుమార్ ఇటీవల మహాకూటమి నుంచి బయటకు వచ్చేశారు. ప్రభుత్వంలో ఆర్జేడీ జోక్యం ఎక్కువ కావడంతో ఆయన బయటకు వచ్చి ఎన్డీఏతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. సాయంత్రం బీజేపీ మద్దతు తొమ్మిదోసారి సీఎంగా నితీష్ ప్రమాణస్వీకారం చేశారు. సోమవారం జరిగిన ఫ్లోర్ టెస్టులో 129 మంది ఎమ్మెల్యేలతో బలపరీక్షను నెగ్గారు. దీంతో రెండు వారాలుగా నెలకొన్న రాజకీయ సంక్షోభానికి తెరపడింది.