NTV Telugu Site icon

Namibian cheetah: కునో పార్క్‌లో మరో చిరుత చనిపోయింది.. ఇప్పటి వరకు 10 మృతి

Namibian Cheetah

Namibian Cheetah

Namibian cheetah: మధ్యప్రదేశ్ కునో నేషనల్ పార్కులో మరో చిరుత మరణించింది. 2022 సెప్టెంబర్ నెలలో నమీబియా నుంచి తీసుకువచ్చిన చిరుతల్లో వరసగా మరణాలు చోటు చేసుకుంటున్నాయి. శౌర్య అని పిలువబడే చిరుత మరణించడంతో ఇప్పటి వరకు 7 పెద్ద చిరుతలు, మూడు చిరుత పిల్లలు మరణించాయి. మార్చి 2023లో 3 చిరుత పులి పిల్లలు మరణించాయి.

Read Also: Dead Rat In Food: రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేసిన ఆహారంలో ఎలుక, బొద్దింక.. ఆస్పత్రి పాలైన లాయర్..

అయితే, మృతికి కారణాలు పోస్టుమార్టం తర్వాతే నిర్ధారించగటమని ప్రాజెక్ట్ డైరెక్టర్ చెప్పారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు చిరుత నడకలో అస్థిరతను ట్రాకింగ్ ద్వారా గమనించామని, చిరుత బలహీనంగా ఉందని, చిరుతను బతికించేందుకు సీపీఆర్ చేసినా ప్రతిస్పందిచలేదని ఆయన వెల్లడించారు.

మొత్తం 20 చిరుతలను నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి కునో నేషనల్ పార్కుకి తీసుకువచ్చారు. ప్రభుత్వం చేపట్టిన ‘‘ప్రాజెక్ట్ చీతా’’ కింద రెండు విడుతలుగా చిరుతలను ఇండియాకు తీసుకువచ్చారు. మొదటి బ్యాచ్ సెప్టెంబర్ 2022లో చేరగా.. రెండో బ్యాచ్ ఫిబ్రవరి 2023లో వచ్చింది. ఈ ప్రాజెక్టు ద్వారా దేశంలోని అడవుల్లో చిరుతలను ప్రవేశపెట్టడానికి కేంద్రం ప్రయత్నిస్తోంది. దాదాపుగా 7 దశాబ్ధాల క్రితం దేశంలో చిరుతలు అంతరించిపోయాయి. వీటిని మళ్లీ పెంచాలనే ఉద్దేశంతోనే ప్రాజెక్ట్ చీతాను చేపట్టారు.