ఢిల్లీ బాంబ్ పేలుడు నేపథ్యంలో ఫరీదాబాద్ అల్-ఫలాహ్ యూనివర్సిటీకి ఎదురుదెబ్బ తగిలింది. తప్పుడు ప్రచారంతో మోసగించినందుకు యూనివర్సిటీకి న్యాక్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. న్యాక్ గుర్తింపు లేకుండానే వైబ్‌సైట్‌లో మాత్రం కళాశాలకు గుర్తింపు ఉందంటూ బహిరంగంగా ప్రదర్శించింది. ఈ నేపథ్యంలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసినందుకు గాను సమాధానం ఇవ్వాలంటూ న్యాక్ నోటీసులు పేర్కొంది.
తప్పుడు సమాచారంతో తల్లిదండ్రులు, విద్యార్థులను తప్పుదారి పట్టించడమే అవుతుందని తన నోటీసుల్లో న్యాక్ పేర్కొంది. 76 ఎకరాల్లో విశాలంగా అల్-ఫలాహ్ యూనివర్సిటీ క్యాంపస్ ఏర్పాటైంది. హర్యానా ప్రైవేటు యూనివర్సిటీల చట్టం కింద దీన్ని ఏర్పాటు చేశారు. 1997లో ఇంజినీరింగ్ కాలేజీగా మొదలైంది. 2013లో యూజీసీకి చెందిన నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ (నాక్) నుంచి ‘ఏ’ గ్రేడ్ అందుకున్నట్లుగా మీడియా కథనాలు పేర్కొన్నాయి. 2014లో హర్యానా రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీ హోదా కల్పించింది. అనుబంధంగా 2019లో అల్-ఫలా మెడికల్ కాలేజీని ఏర్పాటు చేశారు.
ఇది కూడా చదవండి: Delhi Car Blast: వెలుగులోకి సంచలన ఫొటోలు.. దొరికిన ఉమర్ మూడో కారు.. ఎక్కడుందంటే..!
ఢిల్లీ బ్లాస్ట్ తర్వాత అల్-ఫలాహ్ కేంద్రంగా జరిగిన ఉగ్ర కుట్ర బయటపడింది. ముగ్గురు వైద్యులు దేశ వ్యాప్తంగా భారీ దాడులకు కుట్రపన్నారు. ఇందులో ప్రధానంగా డాక్టర్ ఉమర్ ఉన్నారు. ఇతడి నేతృత్వంలోనే ఈ కుట్రకు ప్లాన్ జరిగింది. సోమవారం సాయంత్రం 6:50 గంటల ప్రాంతంలో ఎర్రకోట దగ్గర కారు వెళ్తుండగా ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 13 మంది చనిపోగా.. పలువురు గాయపడ్డారు. ఇక ఉమర్ ఉపయోగించిన మూడు కార్లను గుర్తించారు.
ఇది కూడా చదవండి: Delhi Car Blast: 17వ నెంబర్ భవనం.. రూమ్ నెం.13.. ఢిల్లీ బ్లాస్ట్ వెనుక ఉన్న మిస్టరీ
