Site icon NTV Telugu

63 spoons in the stomach: ఆశ్చర్యకరమైన ఘటన.. కడుపులో ఏకంగా 63 స్పూన్లు

63 Spoons In The Stomach

63 Spoons In The Stomach

63 spoons in the stomach: ఓ వ్యక్తికి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. కడుపులో నొప్పి భరించలేక విలవిల లాడారు. తన పరిస్థితి గమనించిన కుటుంబ సభ్యలు ఆసుపత్రికి తరలించారు. అతనిని అడ్మిట్‌ చేసుకున్న డాక్టర్లు తను కడునొప్పి భరించలేనంతగా బాధపడుతుండటంతో ఆపరేషన్‌ చేసేందుకు సిద్దమయ్యారు. అతని కడుపులో ఏకంగా 63 స్పూన్లు కనిపించడంతో డాక్టర్లు షాక్‌కు గురయ్యారైన ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని ముజఫర్​నగర్​ లోని మాన్సూరాపూర్‌ పోలీస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.

మన్సూరాపూర్​ పోలీస్​స్టేషన్​ పరిధిలోని బోపాడా గ్రామానికి చెందిన విజయ్​ అనే వ్యక్తి మత్తు పదార్థాలకు బానిసయ్యాడు. కుటుంబసభ్యులు మత్తు పదార్థాలు మానేయాలని ఎంతచెప్పిన విజయ్‌ వినలేదు. దీంతో విసుగుచెందిన కుటుంబసభ్యలు అతడికి ఆ అలవాటును మాన్పించేందుకు షామ్‌లీలోని డ్రగ్ డీఅడిక్షన్ సెంటర్ లో చేర్పించారు. విజయ్‌ అక్కడ ఓ నెలరోజుల పాటు చికిత్స పొందాడు. అక్కడే కథ అడ్డం తిరిగింది. డీఅడిక్షన్​ సెంటర్​ లో ఉన్న విజయ్​ కు అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించింది. డీఅడిక్షన్‌ సెంటర్‌ వారు కుటుంబసభ్యులకు సమాచారం అందించగా కుటుంబసభ్యులు వెంటనే ముజఫర్ నగర్‌ లోని ఓ ప్రైవేట్​ ఆస్పత్రికి తరలించారు. బాధితుడు విజయ్‌ కు పరీక్షలు నిర్వహించి, ఆపరేషన్​ చేసిన వైద్యులు షాక్​ కు గురయ్యారు. విజయ్‌ కడుపులో ఏకంగా 63 స్పూన్లు కనిపించాయి. అయితే.. ఆపరేషన్​ చేసిన వైద్యులు వాటిని వెలికితీశారు. విజయ్‌ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. డాక్టర్లు, విజయ్‌ కడుపలో నుంచి స్పూన్లు తీసారు సరే కానీ, ఈ స్పూన్లు అతని కడుపులోకి ఎలా వచ్చాయని వైద్యులకు ప్రశ్నార్థకంగా మారింది. అన్ని స్పూన్లు విజయ్‌ ఎందుకు తిన్నాడు? ఆస్పూన్లు మింగే సమయంలో కూడా విజయ్‌ కు గొంతులో ఎలా మింగాడు గుచ్చుకున్న బాధను ఎందుకు భరించాడు? కుటుంబ సభ్యులకు ఎందుకు తెలిపలేదు? అనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. డ్రగ్​ డీఅడిక్షన్ సెంటర్​ సిబ్బందే విజయ్​ ను బలవంతంగా స్పూన్లు తినిపించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాగా, ఈ విషయంపై విజయ్​ ఎంటువంటి ఫిర్యాదు చేయకపోవడం పలు అనుమానాలకు తావు లేపుతోంది.

Exit mobile version