Site icon NTV Telugu

Namaz For Chandrayaan-3: చంద్రయాన్-3 విజయవంతమవ్వాలని ముస్లింల ప్రార్థనలు

Namaz For Chandrayaan 3

Namaz For Chandrayaan 3

Namaz For Chandrayaan-3: చంద్రుడి రహాస్యాలను తెలుసుకోవడం కోసం భారత్‌ ప్రయోగించిన చంద్రయాన్-3 విజయవంతమవ్యాలని దేశంలోని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయుడి కూడా ఇదే కోరుకుంటున్నారు. చంద్రయాన్‌-3 విజయవంతం కావాలని మతాలకతీతంగా పూజలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే లక్నోలోని ముస్లింలు ప్రార్థనలు నిర్వహించారు. ముస్లిం సోదరులు లక్నోలోని ఇస్లామిక్‌ సెంటర్‌ ఆఫ్‌ ఇండియాలో నమాజ్‌ చేశారు. చంద్రయాన్ -3 భారతీయ కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం 06.04 గంటలకు చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండర్ విక్రమ్ దిగనుంది. దీని కోసం భారతీయులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చంద్రయాన్ -3 చంద్రుడిపై సేఫ్ గా ల్యాండ్ అవ్వాలని ముస్లింలు లక్నోలోని ఇస్లామిక్ సెంటర్ ఆఫ్ ఇండియాలో సోమవారం నమాజ్ చేశారు. మూన్ మిషన్ విజయం సాధించాలని ప్రార్థించారు. దీనికి సంబంధించిన వీడియోను ఏషియా న్యూ ఇంటర్నేషనల్ సంస్థ విడుదల చేసింది. అందులో భారత మూన్ మిషన్ కోసం ముస్లింలు ప్రార్థిస్తున్నారు.

Read Also: Naveen Polisetty: అనుష్క సెట్ కి రాగానే టెక్నీషియన్స్ తో అలా చేస్తుంది: నవీన్ పొలిశెట్టి

యునైటెడ్ కింగ్ డమ్ భారత హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామి లండన్ లో మాట్లాడుతూ.. ‘ఒక దేశంగా భారత్ సాధించిన అద్భుత విజయానికి ఇంతకంటే గొప్పది మరొకటి ఉండదని ఇది కేవలం భారత దౌత్యవేత్తగా కాకుండా గర్వించదగిన భారతీయుడిగా చెబుతున్నానని అన్నారు. ఆర్థిక స్థోమత తక్కువగా ఉన్నప్పుడే భారత్ అంతరిక్ష కార్యక్రమాన్ని ప్రారంభించిందని గుర్తు చేశారు. నేడు ఇది కేవలం మానవ కల్పనకు మాత్రమే పరిమితమైన అంతరిక్ష కార్యక్రమం. చంద్రుడిపై దేనినైనా ల్యాండ్ చేయగల అతికొద్ది దేశాల్లో మనమూ ఉన్నామని.. ప్రపంచంలో ప్రతి ఒక్కరి కంటే ముందుందని ఆయన పేర్కొన్నారు. చంద్రయాన్ -3 సాఫ్ట్ ల్యాండింగ్ పై ఇస్రో మంగళవారం ఒక అప్ డేట్ ఇచ్చింది. మిషన్ షెడ్యూల్ లో ఉందని.. వ్యవస్థలు క్రమం తప్పకుండా తనిఖీలకు లోనవుతున్నాయని పేర్కొంది. ‘‘సజావుగా సాగిపోతున్నది. మిషన్ ఆపరేషన్స్ కాంప్లెక్స్ (ఇస్రోలో) శక్తి, ఉత్సాహంతో కిటకిటలాడుతోంది.’’ అని ట్విట్టర్‌ ఎక్స్ లో పోస్ట్ చేసింది. ట్విట్టర్ ఎక్స్ యజమాని ఎలాన్ మస్క్ కూడా చంద్రయాన్ -3 విజయం కావాలని ఆకాక్షించారు. ఈ ప్రతిష్టాత్మక అంతరిక్ష మిషన్ చేపట్టిన భారతదేశానికి శుభాకాంక్షలని పేర్కొన్నారు. రష్యా పంపించిన లూనా-25 మిషన్ విఫలమైన నేపథ్యంలో ఇపుడు అందరి దృష్టి చంద్రయాన్-3 పై పడింది. మన మూన్ మిషన్ నేటి సాయంత్రం చంద్రుడిపై కాలు మోపడానికి సిద్ధమైంది. భారతీయులే కాక ప్రపంచం మొత్తం దీని కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అయితే డింగ్ కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారం బుధవారం సాయంత్రం 5:20 గంటలకు ప్రారంభమవుతుంది. ల్యాండింగ్ లైవ్ ను ఇస్రో వెబ్ సైట్, దాని యూట్యూబ్ ఛానెల్, ఫేస్ బుక్, పబ్లిక్ బ్రాడ్కాస్టర్ డీడీ నేషనల్ టీవీలో బుధవారం సాయంత్రం 5:27 గంటల నుండి అందుబాటులో ఉండనున్నాయి.

Exit mobile version