Site icon NTV Telugu

Muslim couple married in Hindu style: హిందూ సంప్రదాయం ప్రకారం అమెరికన్ ముస్లిం జంట వివాహం

Muslim Couple Married In Hindu Style

Muslim Couple Married In Hindu Style

Muslim couple married in Hindu style: భారత పర్యటనలో ఉన్న ఓ అమెరికన్ ముస్లిం జంట హిందూ సంప్రదాయాలకు ఫిదా అయ్యారు. అప్పటికే ముస్లిం పద్ధతిలో వివాహం చేసుకున్న వీరిద్దరు మరోసారి హిందూ సంప్రదాయంలో వివాహం చేసుకున్నారు. ఇప్పుడు ఈ వార్త చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. వారిద్దరికి నిఖా జరిగిన 18 ఏళ్ల తరువాత హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు.

అమెరికా సంతతికి చెందిన ముస్లిం జంట, కియామా దిన్ ఖలీఫా, కేషా ఖలీఫా భారతదేశ పర్యటనలో ఉన్నప్పుడు ఇక్కడి సంప్రాదాయాలు, సంస్కృతిని ఎంతగానో ఇష్టపడ్డారు. వారణాసిలోని దేవాలయాలు, మరపరమైన ప్రదేశాల సందర్శించిన సమయంలో భారతీయ సంప్రదాయాలు, హిందూ మతం గురించి ఎంతగానో తెలుసుకున్నారు. అయితే వారికి అప్పటికే వివాహం జరిగి 18 ఏళ్లు అయినా.. మరోసారి హిందూ సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నారు.

Read Also: Iran Hijab Protest: హిజాబ్ నిరసనలు చూస్తే సంతోషంగా ఉంది.. తస్లీమా నస్రీన్ కీలక వ్యాఖ్యలు

శనివారం ఉత్తర్ ప్రదేశ్ లోని జౌన్‌పూర్‌లోని త్రిలోచన్ మహాదేవ్ ఆలయంలో హిందూ సంప్రదాయాలతో మరో సారి ఈ అమెరికన్ ముస్లిం జంట ఒకటయ్యారు. 18 ఏళ్లక్రితం నిఖా జరిగిన వీరిద్దరికి ఇప్పటికే 9 మంది పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం కియామా దిన్ ఖలీఫా, కేషా ఖలీఫాల వయస్సు 40 ఏళ్లు. తన తాత భారతీయ సంతతికి చెందిన హిందువు అని కేషా ఖలీపా తెలిపారు. పెళ్లికి సంబంధించిన అన్ని ఆచార వ్యవహారాలు హిందూ సంప్రదాయం ప్రకారం జరిగాయని పురోహితుడు పండిటత్ గోవింద్ శాస్త్రి తెలిపారు. అగ్ని సాక్షిగా ఏడడుగులు వేస్తూ త్రిలోచన్ మహాదేవ్ ఆలయంలో పెళ్లి జరిగిందని తెలిపారు.

Exit mobile version