ఉత్తరప్రదేశ్‌లో ‘ఐ లవ్ ముహమ్మద్’’ ప్రచారం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. బరేలీ స్థానిక మతాధికారి, ఇత్తెహాద్-ఎ-మిల్లత్ కౌన్సిల్ చీఫ్ తౌకీర్ రజా ‘ఐ లవ్ ముహమ్మద్’ మద్దతుగా నిరసనలకు శుక్రవారం పిలుపునిచ్చారు. అయితే ఈ నిరసనలకు పోలీసులు ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. దీంతో బరేలీ తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం తౌకీర్ రజాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా తౌకీర్ రజా ఇంటి వెలుపల తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీశాయి. పెద్ద ఎత్తున మద్దతుదారులు తరలివచ్చి ‘ఐ లవ్ ముహమ్మద్’ ప్లకార్డులు ప్రదర్శించారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు లాఠీఛార్జ్ నిర్వహించారు.
ఐ లవ్ ముహమ్మద్ ప్రచారానికి మద్దతుగా రజా ఒక వీడియోను పోస్ట్ చేశారు. దీంతో భారీ ఎత్తున జనసమూహం తరలిచ్చింది. నిరసనకారులు రాళ్లు రువ్వడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఈ ఘర్షణలో 10 మంది పోలీసులు గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఇక రజాను విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక బరేలీలో జరిగిన అల్లర్లలో ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. 50 మందికి పైగా వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని.. 1,700 మంది గుర్తు తెలియని వ్యక్తులపై అల్లర్లు, ప్రభుత్వ పనులకు ఆటంకం కలిగించడం, పోలీసు సిబ్బందిపై దాడి వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రజలకు అంతరాయం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు బరేలీలోని అధికారులను ఆదేశించారు.
సెప్టెంబర్ 4న ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఈద్-ఎ-మిలాద్-ఉన్-నబీ ఊరేగింపు సందర్భంగా దారి పొడవునా ఒక టెంట్‌పై ‘ఐ లవ్ ముహమ్మద్’ అనే పోస్టర్‌ను ఉంచడంతో ఈ వివాదం ప్రారంభమైంది. రామ నవమి వంటి హిందూ పండుగలు జరుపుకునే ప్రదేశంలో ఈ పోస్టర్‌ను ఉద్దేశపూర్వకంగా ఏర్పాటు చేశారని స్థానిక హిందూ సంఘాలు తప్పుపట్టాయి. ఆ తర్వాత కొద్దిసేపటికే రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతలకు దారి తీశాయి. తమ పోస్టర్లను చింపి తొలగించారని హిందువులు ఆరోపించగా.. ప్రవక్త పట్ల ప్రేమను వ్యక్తం చేసినందుకు తమను లక్ష్యంగా చేసుకున్నారని ముస్లింలు పేర్కొన్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో కూడా ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఇలా వారాల తరబడి ఈ వివాదం నడుస్తోంది. తాజాగా ఇది తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఇక వారణాసిలో ‘ఐ లవ్ మహమ్మద్’ పోస్టర్లకు వ్యతిరేకంగా ‘ఐ లవ్ మహాదేవ్’ ప్లకార్డులతో ఇరు వర్గాల మతాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ నిరసనలు గుజరాత్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌లో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి. ఐ లవ్ మహమ్మద్ అంటే తప్పేంటని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ వ్యాఖ్యానించారు.
#WATCH | Protestors gathered outside Ala Hazrat Dargah & IMC chief Maulana Tauqeer Raza Khan's house holding 'I Love Mohammad' placards after the Friday prayers in Bareily, UP. Heavy security is deployed at both spots. pic.twitter.com/rcZSAQyH8S
— ANI (@ANI) September 26, 2025
Bareilly, Uttar Pradesh: After Friday prayers, people protested carrying “I Love Muhammad” banners, chanting slogans such as “Allahu Akbar.” When police tried to calm the protesters and the situation got out of control, they resorted to a baton charge to restore order pic.twitter.com/QEO85o5j5P
— IANS (@ians_india) September 26, 2025
