Muslim Bharatanatyam Artist: తిరుచ్చి ఆలయానికి 600 వజ్రాలతో కూడిన కిరీటాన్ని విరాళంగా ఇచ్చిన ముస్లిం కళాకారుడు
- మతసామరస్యానికి ప్రతీకగా భక్తిని చాటుకున్న ఓ ముస్లిం కళాకారుడు..
- తిరుచ్చిలోని శ్రీరంగం ఆలయానికి 600 వజ్రాలతో తయారు చేయించిన కిరీటం విరాళం..
- ఈ రూబీ కిరీటం తయారు చేయడానికి ఎనిమిదేళ్లు పట్టిందని తెలిపిన జహీర్ హుస్సేన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Muslim Bharatanatyam Artist: మతసామరస్యానికి ప్రతీకగా ఓ ముస్లిం కళాకారుడు తన భక్తిని చాటుకున్నాడు. తమిళనాడులోని తిరుచ్చిలో ఉన్న ప్రఖ్యాత శ్రీరంగం రంగనాథర్ ఆలయానికి 600 వజ్రాలతో ప్రత్యేకంగా తయారు చేయించిన కిరీటాన్ని బహుమతిగా ఇచ్చారు. అయితే, ముస్లిం అయిన జహీర్ హుస్సేన్.. భరతనాట్య కళాకారుడు. తన ప్రదర్శనల ద్వారా వచ్చిన మొత్తాన్ని కొద్దికొద్దిగా దాచి పెట్టి.. ఈ కిరీటాన్ని తయారు చేయించారు. బుధవారం నాడు ఆలయ ప్రధాన అర్చకుడు సుందర్ భట్టర్‌కు ఈ విరాళాన్ని అందించారు.
Read Also: Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీపై అనిశ్చితి.. భారీ మార్పు తప్పదా?
Also Read
ఈ సందర్భంగా ముస్లిం భరతనాట్య కళాకారుడు జహీర్ హుస్సేన్ మాట్లాడుతూ.. తనకు ముస్లిం, హిందూ, క్రిస్టియన్ అనే తేడా లేదని చెప్పుకొచ్చారు. ఈ కిరీటాన్ని గోపాల్ దాస్ అనే కళాకారుడు తయారు చేసినట్లు పేర్కొన్నాడు. దీన్ని రూపొందించేందుకు దాదాపు 8 సంవత్సరాల సమయం పట్టినట్లు వెల్లడించారు. 3,169 క్యారెట్ల బరువున్న ఒకే రూబీ రాయితో ఈ కిరీటాన్ని తయారు చేయించినట్లు ఆయన పేర్కొన్నారు. అయితే, ప్రపంచంలోనే ఈ రకమైన మొదటి కిరీటం ఇది అని జాహీర్ హుస్సేన్ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!