NTV Telugu Site icon

Elon Musk’s gift to PM Modi: మోడీకి “టైల్‌”ని గిఫ్ట్‌గా ఇచ్చిన మస్క్.. ఎందుకంత ప్రత్యేకం..

Modi

Modi

Elon Musk’s gift to PM Modi: ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటన ముగిసింది. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా ప్రధాని అమెరికా పర్యటనకు వెళ్లారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, వాణిజ్యంపై ఇరువురు నేతలు చర్చలు జరిపారు. ఈ భేటీకి ముందు, ట్రంప్‌కి అత్యంత సన్నిహితుడిగా ఉన్న బిలియనీర్ ఎలాన్ మస్క్‌తో ప్రధాని భేటీ అయ్యారు. వాషింగ్టన్‌లోని బ్లేయిర్ హౌజ్‌లో ప్రధానిని మస్క్ తన పిల్లలతో కలిశారు. అంతకుముందు, అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ తులసీ గబ్బర్డ్‌తో మోడీ సమావేశమై, భారత్-అమెరికా స్నేహానికి సంబంధించిన అంశాలపై చర్చించారు.

Read Also: Teacher: “నా గర్ల్‌ఫ్రెండ్‌గా ఉండు”.. ఏకలవ్యుడిని ఉదహరిస్తూ, విద్యార్థినికి టీచర్ వేధింపులు..

ఇదిలా ఉంటే, మస్క్ ప్రధాని మోడీకి ఇచ్చిన గిఫ్ట్ ఇప్పుడు అందర్ని ఆకర్షిస్తోంది. మస్క్ స్పేస్ ఎక్స్ రాకెట్ అయిన ‘‘స్టార్ షిప్’’కి చెందిన హీట్ షీల్డ్ నుంచి రాలిపడిన టైల్‌ని గిఫ్ట్‌గా ఇచ్చారు. స్టార్ షిప్ నుంచి ఈ టైల్ రాలిపడింది. స్టార్ షిప్ హీట్ షీల్డ్ టైల్స్, హెగ్జాగోనల్ ఆకారంలో ఉండే సిరామిక్ టైల్స్. ఇవి అంతరిక్ష నౌకలు మళ్లీ భూమిపైకి(రీఎంట్రీ) తిరిగి వచ్చే క్రమంలో కీలకంగా మారుతాయి. అంతరిక్ష నౌక భూమి వాతావరణంలోకి వచ్చే సమయంలో విపరీతమైన ఘర్షణ ఏర్పడుతుంది. దీని నుంచి పుట్టే ఉష్ణోగ్రత నుంచి సిరామిక్ టైల్స్ అంతరిక్ష నౌకని రక్షిస్తాయి. ఈ టైల్స్ వందల డిగ్రీల వేడిని తట్టుకుని, అంతరిక్ష నౌకలకు నష్టం కలగకుండా చూస్తుంది.