Site icon NTV Telugu

Murshidabad Riots: ముర్షిదాబాద్ అల్లర్లు.. తండ్రీకొడుకుల హత్యలో 13 మంది నిందితులు..

Murshidabad Riots

Murshidabad Riots

Murshidabad Riots: ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ‘‘వక్ఫ్ చట్టానికి’’ వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ ముర్షిదాబాద్‌లో తీవ్ర మత ఘర్షణలు జరిగాయి. ఆందోళన నిర్వహించిన ముస్లిం గ్రూపులో కొందరు వ్యక్తులు హిందువుల్ని టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడ్డారు. హిందువుల ఆస్తులపై దాడులు చేశారు. ఈ అల్లర్లపై కలకత్తా హైకోర్టు ఏర్పాటు చేసిన నిజనిర్ధారణ బృందం కీలక విషయాలను వెలుగులోకి తెచ్చింది. పోలీసులు ఈ అల్లర్లను అడ్డుకోవడానికి ప్రయత్నించలేదని, అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేతలు, ముఖ్యంగా టీఎంసీ నాయకుడు మెహబూబ్ ఆలం ఈ అల్లర్లలో ప్రధాన నిందితుడిగా తేల్చింది.

Read Also: SVSN Varma : పవన్ కల్యాణ్‌ చెప్పినా మారరా.. ఇసుక మాఫియాపై వర్మ కామెంట్స్..

ఈ అల్లర్లలో తండ్రీకొడుకులను హత్య చేసిన కేసులో 13 మందిపై బెంగాల్ పోలీసులు చార్జిసీట్ దాఖలు చేశారు. ముర్షిదాబాద్ జిల్లాలో చెలరేగిన మత హింసలో హరగోబిందో దాస్ (74), అతని కుమారుడు చందన్ దాస్ (40)లను నరికి చంపారు. శుక్రవారం ప్రార్థనల తర్వాత షంషేర్‌గంజ్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. జట్బోజా గ్రామంలోని బాధితుల ఇంటి తలుపులు పగలగొట్టి, వీరిని బయటకు లాగి పట్టపగలు నరికి చంపారు.

ఈ దాడి స్థానిక తృణమూల్ కాంగ్రెస్ నేత, ధులియాన్ మునిసిపాలిటీ మాజీ చైర్మన్ మెహబూబ్ ఆలంపై హైకోర్టు నిజనిర్ధారణ తేల్చింది. నిందితులపై అల్లర్లకు పాల్పడటం, బలవంతంగా ఇంట్లోకి చొరబడటం, ఐదుగురికి పైగా వ్యక్తుల బృందం హత్య చేయడం, ఆయుధాలు మరియు మందుగుండు సామగ్రిని అక్రమంగా కలిగి ఉండటం వంటి అభియోగాలు మోపబడ్డాయి. ఏప్రిల్ 8 నుండి 12 వరకు జరిగిన అల్లర్లలో ముగ్గురు మరణించారు, అనేక మంది గాయపడ్డారు, వందలాది మంది తమ ఇళ్లను పొరుగున ఉన్న మాల్డా జిల్లాకు పారిపోయారు. హింసకు సంబంధించి 300 మందిని అరెస్ట్ చేశారు. ఈ హింసాకాండపై ముర్షిదాబాద్‌లోని వివిధ పోలీస్ స్టేషన్లలో 60కి పైగా ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి.

Exit mobile version