Site icon NTV Telugu

Droupadi Murmu: 10, 11 తేదీల్లో జార్ఖండ్‌లో రాష్ట్రపతి పర్యటన.. బాబా బైద్యనాథ్ ధామ్‌ సందర్శన

Droupadimurmu

Droupadimurmu

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజుల పాటు జార్ఖండ్‌లో పర్యటించనున్నారు. జూన్ 10, 11 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ మేరకు సన్నాహాలు చేస్తున్నట్లు శుక్రవారం ప్రధాన కార్యదర్శి అల్కా తివారీ తెలిపారు. జూన్ 10న రాష్ట్రపతి డియోఘర్ చేరుకోనున్నారు. జ్యోతిర్లింగాలలో ఒకటైన ఆలయ పట్టణంలోని ప్రముఖ తీర్థయాత్ర గమ్యస్థానంగా ఉన్న బాబా బైద్యనాథ్ ధామ్‌ను సందర్శించనున్నారు. ఇక జూన్ 11న డియోఘర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) మొదటి స్నాతకోత్సవ కార్యక్రమానికి హాజరవుతారు.

ఇది కూడా చదవండి: Bunny Vasu: కొట్టుకోవడం కాదు.. పెద్ద హీరోలు ఆలోచించాలి!

ఇక రాష్ట్రపతి పర్యటనకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రపతి వెళ్లే మార్గంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నారు. అంతేకాకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. ఇక పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించడానికి నలుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులను వినియోగిస్తున్నట్లు డీజీపీ అనురాగ్ గుప్తా తెలిపారు.

ఇది కూడా చదవండి: Subhashree Rayaguru: నిర్మాతతో బిగ్ బాస్ కంటెస్టెంట్ ఎంగేజ్మెంట్.. ఫొటోలను షేర్ చేసిన బ్యూటీ

Exit mobile version