NTV Telugu Site icon

Tahawwur Rana: తహవూర్ రాణా టార్గెట్‌లో కుంభమేళా, పుష్కర్ మేళా..

Tahawwur Rana

Tahawwur Rana

Tahawwur Rana: మోస్ట్ వాంటెండ్ ఉగ్రవాది తహవూర్ రాణాని అమెరికా నుంచి ఇండియాకు తీసుకువచ్చారు. 26/11 ముంబై ఉగ్రదాడుల్లో ఇతను కీలక ఉగ్రవాదిగా ఉన్నారు. పాకిస్తానీ కెనెడియన్ అయిన రాణా భారత్‌కి అప్పగింతను తప్పించుకోవడానికి అమెరికాలోని న్యాయ సదుపాయాలను దాదాపుగా ఉపయోగించాడు. అయినా ప్రయోజనం లేకపోయింది. అక్కడి న్యాయస్థానాలు రాణానికి ఇండియాకు అప్పగించాలని స్పష్టం చేయడంతో, భారత అధికారులు అతడిని ఇండియాకు గురువారం తీసుకువచ్చారు. ఎన్ఐఏ, ఇతర ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు రాణానికి విచారించనున్నాయి.

ఇదిలా ఉంటే, రాణా విషయంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 26/11 ముంబై ఉగ్రదాడులకు ముందు ప్రధాన మతపరమైన కార్యక్రమాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. భారత రక్షణ దళాలకు చెందిన అధికారులు ఉండే ముంబైలోని జల్ వాయు విహార్ కూడా ఇతడి టార్గెట్‌లో ఉంది.

Read Also: YS Jagan: కచ్చితంగా మళ్లీ అధికారంలోకి వస్తాం.. జగన్‌ 2.O మీరు కోరుకున్న విధంగా ఉంటుంది..!

జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) మాజీ ఇన్‌స్పెక్టర్ జనరల్ లోక్‌నాథ్ బెహెరా మాట్లాడుతూ.. తహవూర్ రాణా హరిద్వార్‌లో జరిగే కుంభమేళాని లక్ష్యంగా చేసుకుని ప్రణాళికలు రూపొందించాడని, రాజస్థాన్‌లోని పుష్కర్ మేళాలో నిఘా నిర్వహించడాని వెల్లడించాడు. ఇంతే కాకుండా భారతదేశంలోని కొచ్చిన్‌లపై కూడా కుట్రకు పాల్పడినట్లు వెల్లడైంది. కొచ్చిన్‌లోని నావల్ కమాండ్, షిప్ యార్డ్ వంటి కీలకమైన వాటిపై రెక్కీ నిర్వహించడానికి స్థానిక వ్యక్తుల్ని రిక్రూట్ చేసుకోవాలని భావించాడని తెలిసింది.

జర్నలిస్ట్ సందీప్ ఉన్నితాన్ మాట్లాడుతూ. ముంబైలోని జల్ వాయు విహార్‌ కూడా రాణా లక్ష్యాల్లో ఉందని చెప్పారు. ఈ ప్రాంతంలో వైమానికి, నేవీ మాజీ సైనికులు నివాసం ఉంటారు. 1971 ఇండియా పాక్ యుద్ధానికి ప్రతీకార చర్యగా సైనికులు నివసించే జల్ వాయు విహార్‌పై దాడికి చేయాలని మరో ఉగ్రవాది డేవిడ్ కోల్మన్ హెడ్లీకి రాణా చెప్పినట్లు తెలుస్తోంది.