Site icon NTV Telugu

Mumbai: బ్లింకిట్ బాయ్ దుశ్చర్య.. డెలివరీ చేస్తూ మహిళను ఏం చేశాడంటే..!

Mumbai

Mumbai

స్త్రీలను గౌరవించడం ప్రతి పౌరుడి యొక్క బాధ్యత. అంతేకాదు ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని పెద్దలు అంటుంటారు. అలాంటిది ఒక డెలివరీ బాయ్ నీచంగా ప్రవర్తించాడు. డెలివరీ చేసేందుకు ఇంటికొచ్చి మహిళను తాకరాని చోట తాకి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో మహిళ ఒక్కసారిగా అవాక్కైంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డైంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇది కూడా చదవండి: Gyanesh Kumar: బీహార్ ఎన్నికల తేదీపై సీఈసీ కీలక ప్రకటన

ముంబైకి చెందిన ఒక మహిళ బ్లింకిట్‌లో వస్తువులు బుక్ చేసుకుంది. దీంతో బ్లింకిట్ డెలివరీ బాయ్ ఇంటికి తీసుకొచ్చాడు. వస్తువులను అందించే క్రమంలో మహిళ వక్షోజాలను ఉద్దేశపూర్వకంగా తాకాడు. ఎవరూ చూడడం లేదనో.. లేదంటే మహిళ ఒక్కతే ఉందనుకున్నాడో ఏమో తెలియదు గానీ.. మహిళ డబ్బులు ఇస్తుంటే.. కుడి హస్తాన్ని ఆమె ఛాతీపై వేసి తాకాడు. దీంతో ఆమె అవాక్కై దూరంగా జరిగింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డైంది.

ఇది కూడా చదవండి: PriyaPrakashVarrier : ప్రియా ప్రకాష్.. అందాలు శెభాష్

జరిగిన అవమానాన్ని బాధిత మహిళ వీడియోతో పాటు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. బింక్లిట్ బాయ్ తనను అనుచితంగా తాకాడంటూ రాసుకొచ్చింది. బ్లింకిట్ బాయ్ తన చిరునామా అడిగి.. అనంతరం అనుచితంగా ప్రవర్తించాడని.. ఇది ఆమోదయోగ్యం కాదని.. దయచేసి అతడిపై చర్యలు తీసుకోవాలని కోరింది. దీనికి బ్లింకిట్ స్పందిస్తూ ఈ సంఘటనకు చింతిస్తున్నామని.. మీ బాధను అర్థం చేసుకున్నామని.. ఏదైనా సహాయం కావాలంటే చేస్తామని తెలిపింది. బ్లింకిట్ స్పందనపై బాధిత మహిళ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ప్లాట్‌ఫామ్ నుంచి వైదొలిగింది.

వీడియో వైరల్ కావడంతో ముంబై పోలీసులు స్పందించారు. మీ వివరాలు తెలియజేయాలని కోరింది. మిమ్మల్ని కలిసి వివరాలు తెలుసుకుంటామని ఎక్స్‌లో పోలీసులు కోరారు. ఇక బాధిత మహిళకు మద్దతుగా నెటిజన్లు నిలిచారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్దేశపూర్వకంగా తాకినట్లు వీడియోలో కనిపించిందని.. కచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందేనని మరికొందరు డిమాండ్ చేశారు.

Exit mobile version