NTV Telugu Site icon

Travel Company: గమ్యస్థానానికి 50 కి.మీ దూరంలో దించిన బస్సు.. బాధితుడికి రూ. 2 లక్షలు చెల్లించాలని ఆదేశం..

Travel Company

Travel Company

Travel Company: బస్సు ప్రయాణంలో తనను గమ్యస్థానానికి చేర్చకుండా ఇబ్బందులకు గురి చేసిన ట్రావెల్ కంపెనీకి రూ. 2 లక్షల జరిమానా విధించారు. బాధితుడైన ముంబై వాసికి టికెట్ డబ్బులతో పాటు రూ. 2 లక్షలు చెల్లించాలని వినియోగదారుల ఫోరం తీర్పు చెప్పింది. ట్రావెల్ పోర్టర్, బస్ సర్వీస్ రూట్ మార్పు గురించి ఫిర్యాదుదారుడికి ముందుగానే తెలియజేయాలని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేయాలని వినియోగదారుల కమిషన్ పేర్కొంది. టిక్కెట్ ధర రూ. 745తో పాటు 2 లక్షలు 69 ఏళ్ల వ్యక్తికి చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ట్రావెల్ సంస్థ నిర్ణయంతో సీనియర్ సిటిజన్ అసౌకర్యంతో పాటు బాధను అనుభవించారని చెప్పింది.

Read Also: Ram Mandir Inauguration: రామమందిర వేడుకకు 55 దేశాల నుంచి 100 మంది ప్రముఖుల రాక..

వివరాల్లోకి వెళ్తే.. 2018లో సూరత్ నుంచి ముంబైకి వస్తున్న కండివాలి నివాసి అయిన శేఖర్ హట్టంగడి గమ్యస్థానానికి 50 కిలోమీటర్ల దూరంలో డ్రాప్ చేసింది. దీనిపై ఆయన ఫిర్యాదు చేశారు. ఈ చర్యల వల్ల ఫిర్యాదుదారుడికి మానసిక వేదన, ఇబ్బంది ఎదుర్కొన్నారని, అతను పరిహారం పొందేందుకు అర్హుడని వినియోగదారుల ఫోరం చెప్పింది. అతను Travekyaari.com అనే ట్రావెల్ పోర్టల్ ద్వారా బస్సు టిక్కెట్‌ను కొనుగోలు చేశాడు. అహ్మదాబాద్-ముంబై హైవేలో మరమ్మతులు జరుగున్నందున, బస్సు డ్రైవర్ ప్రధాన రహదారి నుంచి థానే వైపు మళ్లించాడు. రూట్ మ్యాప్ గురించి ఫిర్యాదుదారునికి కనీస సమాచారం అందించలేదు.

డిసెంబర్ 12, 2018న వెబ్‌సైట్ నుంచి ఆన్‌లైన్ ద్వారా పౌలో ట్రావెల్స్ టికెట్ కొనుగోలు చేశానని, తనకు సూరత్‌లో కరెక్ట్ పికప్ పాయింట్ అందించకపోవడంతో పాటు ముంబై శివార్లలో 50 కిమీ దూరంలో తనను బలవంతంగా దించేశారని వినియోదారుల వివాదాల పరిష్కార కమిషన్ ముందు ఫిర్యాదు చేశారు. తనను గమ్యస్థానానికి చేర్చడంలో పాలో ట్రావెల్స్ విఫలమైందని, మాన్‌టిస్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ కేవలం ఈమెయిల్ ద్వారా క్షమాపణలు చెప్పింది కానీ.. తన బాధ్యతను అంగీకరించలేదని శేఖర్ హట్టంగడి చెప్పారు. ఈ కేసులో మాన్‌టిస్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్, పాలో ట్రావెల్స్ పరిహారంగా టికెట్ ధరతో కలిపి రూ. 2 లక్షలు చెల్లించడమే కాకుండా.. న్యాయ ఖర్చులు రూ. 2000 ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.