Suicide Attempt: నొప్పి లేకుండా ఆత్మహత్య చేసుకోవాలనుకున్న యువకుడు.. రక్షించిన పోలీసులు.. ఎలాగంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suicide Attempt: ఇటీవల కాలంలో యువతలో ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. చిన్న ఒత్తడిని కూడా తట్టుకోలేకపోతున్నారు. ఏ చిన్న సమస్య వచ్చినా దానికి ఆత్మహత్యే శరణ్యం అనుకుని ప్రాణాలు వదులుతున్నారు. ఇలాగే ముంబైకి చెందిన 25 ఏళ్ల ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడాలని అనుకున్నారు. కానీ అనూహ్యంగా పోలీసులు వచ్చి కాపాడారు. ఇదంతా సదరు యువకుడికి తెలయకుండానే జరిగింది.
Read Also: Turkey Earthquake: టర్కీ భూకంపంలో మృత్యుంజయులెందరో..
Also Read
- MK Stalin: టీవీకే ప్రభుత్వంపై ఎంకే స్టాలిన్ తీవ్ర విమర్శలు.. పరిస్థితి మారింది, ప్రభుత్వాన్ని గద్దె దించాలంటూ..
- Odisha Engineer: రూ.6 వేల జీతంతో ప్రారంభం.. రూ.2 కోట్ల ఆస్తులతో పట్టుబడ్డ ప్రభుత్వ ఉద్యోగి
- Mohali Office Murder: ఆ కారణంతోనే చంపాడు.. మొహాలి ఘటన చెప్పిన చేదు నిజం!
- NEET UG 2026: నీట్ రీ-ఎగ్జామ్ కు ముందు.. పేపర్ లీక్ వదంతులపై విద్యార్థులకు ఎన్టీఏ విజ్ఞప్తి..
వివరాల్లోకి వెళితే.. ముంబై జోగిశ్వరీ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు ఓ ప్రైవేట్ కంపెనీలో ఐటీ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. తన చదువు, ఇతర అవసరాల కోసం పలు ఆర్థిక సంస్థల నుంచి అప్పులు తీసుకున్నాడు. హౌసింగ్ లోన్లతో పాటు ఇతర రుణాలను కూడా చెల్లించలేదు. దీంతో నిరాశతో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. అయితే నొప్పి లేకుండా ఆత్మహత్య చేసుకోవడం ఎలా..? అని గూగుల్ లో సెర్చ్ చేయడం ప్రారంభించాడు. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన యుఎస్ నేషనల్ సెంట్రల్ బ్యూరో-ఇంటర్‌పోల్ అతని గూగుల్ సెర్చ్ హిస్టరీని ట్రాక్ చేసి ఆ సమాచారాన్ని ముంబై పోలీసులకు అందించింది.
ఈ సమాచారం సహాయంతో ముంబై పోలీసులు ఐపీ అడ్రస్ ఆధారంగా సదరు యువకుడి లొకేషన్, ఐపీ ఆడ్రస్ వంటి కీలక సమాచాారాన్ని సేకరించారు. మంగళవారం మధ్యాహ్నం కుర్లా ప్రాంతంలోని ఓ ఐటీ కంపెనీలో యువకుడిని గుర్తించారు పోలీసులు. పోలీసులు అతడికి కౌన్సిలింగ్ ఇచ్చారు. అంతకుముందు మూడు నాలుగు సార్లు ఆత్మహత్య చేసుకోవడానికి యువకుడు ప్రయత్నించినట్లు పోలీస్ విచారణలో తేలింది. కౌన్సిలింగ్ తర్వాత యువకుడిని తల్లిదండ్రులతో ఇంటికి పంపించి, సైకో థెరపీ చేయించాలని సూచించారు.
తాజావార్తలు
-
Kings and Queens Pub: కూకట్‌పల్లిలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్‌పై పోలీసుల ఆకస్మిక దాడులు.. 9 మంది అదుపులోకి
-
Raviteja : ‘ఇరుముడి’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. సరైన డేట్ లాక్ చేసిన మేకర్స్
-
Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్‌కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
-
Nana Patekar Slap Incident : నానాపటేకర్ గారు నన్ను చెంపదెబ్బ కొట్టింది నిజమే.! ప్రముఖ నటి షాకింగ్ కామెంట్స్
-
MK Stalin: టీవీకే ప్రభుత్వంపై ఎంకే స్టాలిన్ తీవ్ర విమర్శలు.. పరిస్థితి మారింది, ప్రభుత్వాన్ని గద్దె దించాలంటూ..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!