NTV Telugu Site icon

Suicide Attempt: నొప్పి లేకుండా ఆత్మహత్య చేసుకోవాలనుకున్న యువకుడు.. రక్షించిన పోలీసులు.. ఎలాగంటే..?

Suicide Attempt

Suicide Attempt

Suicide Attempt: ఇటీవల కాలంలో యువతలో ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. చిన్న ఒత్తడిని కూడా తట్టుకోలేకపోతున్నారు. ఏ చిన్న సమస్య వచ్చినా దానికి ఆత్మహత్యే శరణ్యం అనుకుని ప్రాణాలు వదులుతున్నారు. ఇలాగే ముంబైకి చెందిన 25 ఏళ్ల ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడాలని అనుకున్నారు. కానీ అనూహ్యంగా పోలీసులు వచ్చి కాపాడారు. ఇదంతా సదరు యువకుడికి తెలయకుండానే జరిగింది.

Read Also: Turkey Earthquake: టర్కీ భూకంపంలో మృత్యుంజయులెందరో..

వివరాల్లోకి వెళితే.. ముంబై జోగిశ్వరీ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు ఓ ప్రైవేట్ కంపెనీలో ఐటీ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. తన చదువు, ఇతర అవసరాల కోసం పలు ఆర్థిక సంస్థల నుంచి అప్పులు తీసుకున్నాడు. హౌసింగ్ లోన్లతో పాటు ఇతర రుణాలను కూడా చెల్లించలేదు. దీంతో నిరాశతో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. అయితే నొప్పి లేకుండా ఆత్మహత్య చేసుకోవడం ఎలా..? అని గూగుల్ లో సెర్చ్ చేయడం ప్రారంభించాడు. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన యుఎస్ నేషనల్ సెంట్రల్ బ్యూరో-ఇంటర్‌పోల్ అతని గూగుల్ సెర్చ్ హిస్టరీని ట్రాక్ చేసి ఆ సమాచారాన్ని ముంబై పోలీసులకు అందించింది.

ఈ సమాచారం సహాయంతో ముంబై పోలీసులు ఐపీ అడ్రస్ ఆధారంగా సదరు యువకుడి లొకేషన్, ఐపీ ఆడ్రస్ వంటి కీలక సమాచాారాన్ని సేకరించారు. మంగళవారం మధ్యాహ్నం కుర్లా ప్రాంతంలోని ఓ ఐటీ కంపెనీలో యువకుడిని గుర్తించారు పోలీసులు. పోలీసులు అతడికి కౌన్సిలింగ్ ఇచ్చారు. అంతకుముందు మూడు నాలుగు సార్లు ఆత్మహత్య చేసుకోవడానికి యువకుడు ప్రయత్నించినట్లు పోలీస్ విచారణలో తేలింది. కౌన్సిలింగ్ తర్వాత యువకుడిని తల్లిదండ్రులతో ఇంటికి పంపించి, సైకో థెరపీ చేయించాలని సూచించారు.